Share News

తన స్థాయిని తగ్గించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:41 PM

పేదలను మోసం చేసి ఇళ్లపట్టాలు ఇచ్చి జైలుకు వెళ్ళిన శ్రీకాంత్‌గ ౌడ్‌ను పరామర్శించి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన స్థాయిని తగ్గించుకున్నారని టీపీసీసీ అధికారప్రతినిధి వినోద్‌కుమార్‌ అన్నారు.

తన స్థాయిని తగ్గించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

బీఆర్‌ఎస్‌ పాలనలో ఎందుకు సిగ్గుపడలేదు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యో తి): ఐపీఎస్‌ అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలంటే తమ కెంతో గౌరవమని, అయితే పేదలను మోసం చేసి ఇళ్లపట్టాలు ఇచ్చి జైలుకు వెళ్ళిన శ్రీకాంత్‌గ ౌడ్‌ను పరామర్శించి ఆయన తన స్థాయిని తగ్గించుకున్నారని టీపీసీసీ అధికారప్రతినిధి వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమా ర్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ అమరేందర్‌రాజు,డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రితో కలిసి మాట్లాడా రు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సోదరుడు నకిలీపట్టాలు తయారుచేసి పేదలకు కట్టబెట్టి మోసం చేసిన కేసులో జైలులో ఉంటే తట్టుకోలే క రోజుకో నాయకుడిని తీసుకువచ్చి బొంబాయి తమాషా చేస్తున్నారని దుయ్యబట్టారు. మీ చదు వుకు మీరు మాట్లాడిన మాటలకు ఏమైనా పొం తన ఉందా అసలు మీలాంటి వ్యక్తుల నోటివెం ట ఇలాంటి మాటలు రావడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు గాంధీభవన్‌లో తయారవుతున్నాయని మాట్లాడ టం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్టీఫెన్‌ రవీం ద్రతో హత్య కేసు కట్టుకథ గురించి మీరు మరిచి పోయారా అని గుర్తుచేశారు.

మిమ్మల్ని పార్టీలకతీతంగా గౌరవిస్తామని, తమతోపాటు సీఎం వరకు నీపై అదే అభిప్రా యం ఉందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాల న్నారు. లేదంటే నీ బండారం బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావే శంలో నాయకులు రాములుయాదవ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:41 PM