Share News

సన్నరకాల వడ్లకు రూ.500 బోనస్‌

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:32 PM

రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల వడ్లకు బోనస్‌గా రూ.500 అందజేస్తుందని తెలిపారు. ధాన్యం మిల్లులకు వెళ్లిన 48 గంటలలోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందni జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్‌ aన్నారు.

సన్నరకాల వడ్లకు రూ.500 బోనస్‌

- జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్‌

మిడ్జిల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు వర్షసూచన ఉందని వరిధాన్యం ఆరబోసుకున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్‌ తెలిపారు. గురువారం మండలంలోని మున్ననూర్‌ టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల వడ్లకు బోనస్‌గా రూ.500 అందజేస్తుందని తెలిపారు. ధాన్యం మిల్లులకు వెళ్లిన 48 గంటలలోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం ఆరబోసుకున్న రైతులు వర్ష సూచన ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్‌, కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఆయన వెంట ఏవో సిద్ధార్థ, ఏఈవోలు అశ్రపాతిమా, నాయకులు, రైతులు మల్లికార్జున్‌రెడ్డి, వెంకటయ్య, రవి, చెన్నయ్య, వరిధాన్యం కొనుగోలు ఇంచార్జీ శేఖర్‌తో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు తదితరులున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:32 PM