Share News

లే అవుట్ల అనుమతికి నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:47 PM

లే అవుట్ల ప్లాట్ల అనుమతి విషయ ంలో ప్రభుత్వ నిబంధనలు పాటిం చాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌ స మావేశ మందిరంలో అదనపు క లెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) సంచిత్‌ గంగ్వార్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటేశ్వ ర్లుతో కలిసి లేవుట్‌ కమిటీ సమావేశం నిర్వహిం చారు.

లే అవుట్ల అనుమతికి నిబంధనలు పాటించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : లే అవుట్ల ప్లాట్ల అనుమతి విషయ ంలో ప్రభుత్వ నిబంధనలు పాటిం చాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌ స మావేశ మందిరంలో అదనపు క లెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) సంచిత్‌ గంగ్వార్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటేశ్వ ర్లుతో కలిసి లేవుట్‌ కమిటీ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కమిటీ ముందుకు వచ్చి న లే అవుట్లపై చర్చించారు. లే అవుట్‌ అనుమ తి కొరకు వచ్చిన దరఖాస్తులను గరిష్టంగా 21 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ సర్వే

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ ప్రారంభించిందని క లెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. ఈ యాప్‌లో స ర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధి కారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్ట రేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ సర్వే నిర్వహణపై సమావేశం నిర్వహిం చారు. ప్రజా పాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ ఇం దిరమ్మ ఇళ్ల యాప్‌ ద్వారా సర్వే చేయాలని ఆదే శించారు. శనివారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల యా ప్‌లో సర్వే ప్రారంభించాలని ఆదేశించారు.

Updated Date - Dec 06 , 2024 | 11:47 PM