Share News

సుంకులమ్మకు ‘సమగ్ర’ మొర

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:42 PM

తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు సుంకులమ్మను కోరారు.

సుంకులమ్మకు ‘సమగ్ర’ మొర
బోనాలు ఎత్తుకుని నిరసన ర్యాలీ సాగిస్తున్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు

- బోనాలు ఎత్తుకొని సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల నిరసన

గద్వాల టౌన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు సుంకులమ్మను కోరారు. పట్టణంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వారు, 18వ రోజు శుక్రవా రం బోనాలు ఎత్తుకొని జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక స్మృతివనం నుంచి బోనాలతో బయలుదేరి సుంకులమ్మ ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, తిరిగి బోనాలతో పాతబస్టాండ్‌ సర్కిల్‌, కృష్ణవేణి చౌర స్తా, గాంధీచౌక్‌, రాజీవ్‌మార్గ్‌ మీదుగా దీక్షా శిబి రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శిబి రం వద్దకు వచ్చిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ జితేందర్‌, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి భరత్‌కుమా ర్‌ దీక్షలకు మద్దతు తెలిపారు. శిబిరంలో జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హుసేనప్ప, గోపా ల్‌, మహిళా అధ్యక్షురాలు ప్రణీత, గద్వాల అర్బ న్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శేష న్న, కేజీబీవీల సీఆర్‌టీలు, టీజీసీఆర్‌టీలు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, రామాంజనేయులు, శ్రీధర్‌, అల్తా ఫ్‌, సమి, మురళి, రాజేందర్‌ ఉన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:42 PM