అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు
ABN , Publish Date - Jan 16 , 2024 | 11:09 PM
నియోజకవర్గం లోని అచ్చంపేట, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల, అ మ్రాబాద్, పదర మండలాల్లోని గ్రామాల్లో సంక్రాంతి ఉ త్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.
- ఇంటి ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు
- ఊరూరా ఎద్దుల బండలాగుడు పోటీలు
అచ్చంపేటటౌన్, జనవరి 16: నియోజకవర్గం లోని అచ్చంపేట, లింగాల, బల్మూరు, ఉప్పునుంతల, అ మ్రాబాద్, పదర మండలాల్లోని గ్రామాల్లో సంక్రాంతి ఉ త్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. అన్ని పంటలు చేతి కందడంతో రైతులు జరుపుకునే ఈ పండగ చూపరులను ఆకట్టుకునేలా సాగుతుంది. బండలాగుడు, పొట్టేళ్లు, ఎడ్ల బండ్ల పరుగుపద్దెం, గానుగపోటీలతో పాటు అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ఆయా గ్రామాల్లో దేవాలయాల చుట్టూ ప్రదర్శన చేశారు. సంక్రాంతి పర్వ దినం తెల్లవారుజామునుంచే ఆడపడుచులు తమ ఇంటి ముంగిళ్లలో ముగ్గులు తిర్చిదిద్ది గొబ్బెమ్మెలను ఉంచారు. చిన్నారులు యువకులు గాలిపటాలను ఎగరవేస్తూ సంతో షాలను పంచుకున్నారు. నియోజకవర్గంలోని ఉప్పునుంత ల మండల పరిధిలోని పెనిమిళ్ల గ్రామంలో బండలాగు డు పోటీల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని బహుమతులు అందజేశారు.
ప్రభ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉప్పునుంతల: సంక్రాంతి పండగ సందర్బంగా సోమవారం రాత్రి మండల కేంద్రమైన ఉప్పునుంతలలోని శివాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విఽధంగా ఉమామమహేశ్వరం స్వామి ప్రభ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలుకుతూ శాలువాతో ఘన సన్మానం చేశారు. ఆయన వెంట నాయకులు అనంతరెడ్డి, సర్పంచ్ సరిత, శ్రీను, మమస్త్రష్, తదితరులు ఉన్నారు.
చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో..
ఉప్పునుంతల మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రా మంలో సోమవారం రాత్రి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా లలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. చెన్నకేశవస్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కోలాటాలు, బతుక మ్మల మధ్య ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరెడ్డి, నర్సింహరావు, నరేష్ తదితరులు ఉన్నారు.
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
వంగూరు: సంక్రాంతి పండగను పురస్కరించుకొని మండలంలోని రంగాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మొ త్తం 8 ఎద్దుల జట్లు పాల్గొన్నాయి. రంగాపూర్‌కు చెందిన రైతు అల్లె లక్ష్మయ్య ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ. 20,116 బహుమతిని గెలుచుకోగా, చెర్క శ్రీనయ్యకు చెందిన ఎద్దులు రెండవ స్థానంలో నిలిచి రూ.12,116, చెన్న ఎల్లస్వామికి చెందిన ఎద్దులు మూడవ స్థానంలో నిలిచి రూ.6,116ల బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బా లరాజు, ఆయన సతీమణి అమల హాజరై రైతులకు బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సంధ్య, రమణరెడ్డి, చంద్రమౌళి, ఆనందరెడ్డి, లాలుయాదవ్ అం కుసురేందర్, జిలుకర సైదులు, ఆంకూరి అంజి, సాయి బాబు, శరత్‌రెడ్డి, అల్లె లక్ష్మయ్య రామస్వామి పాల్గొన్నారు.
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
వంగూరు మండలంలోని అన్నారంలో చెన్న కేశవస్వా మి ఉత్పవాలు వైభవంగా నిర్వహించారు. స్థానికులు బం డ్లు, బోనాలతో ఊరేగింపుతో ఆలయానికి వచ్చి చుట్టూ తి ప్పారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉపసర్పం చ్ మెరుగు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-లింగాల: మండల కేంద్రమైన లింగాలలో, మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలను, ఎద్దుల బండ్లను అందంగా అలంకరించి మండల కేంద్రం లోని శ్రీకోదండ రామాలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు.
- చారకొండ: మకర సంక్రాతి పర్వదిన వేడుకలను చారకొండ మండలంలోని గ్రామాల్లో మూడు రోజల పా టు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు తమ ఇళ్లముందు కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు, రేగిపళ్లు, నవధన్యాలు, పూలు పెట్టారు. మహిళలు పిండి వంటలు చేశారు. రైతులు తమ పాడి పశువులను అలంకరించి పూజలు చేశారు. మండలంలోని శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాల యంతో పాటు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు.
ఘనంగా ప్రభోత్సవం
మన్ననూర్: అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు వేణుగోపాలస్వామి ఆలయం నుంచి శివపార్వతుల ప్రభో త్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్ర త్యేక వాహనంపై విద్యుత్తు దీపాలంకరణ నడుమ శివపా ర్వతుల ప్రతిమలను గ్రామ పురవీధుల గుండా ఊరేగిం పు చేశారు. సోమవారం వేకువజామున మన్ననూరు గ్రా మం నుంచి ఉమామహేశ్వర కల్యాణోత్సవానికి మెట్టెలు, మాంగల్యం, తలంబ్రాలు తీసుకెళ్లారు. ప్రభోత్సవం సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయంలో జడ్పీటీసీ స భ్యురాలు డాక్టర్ అనూరాధ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రభ వాహనాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యుడు దా సరి శ్రీనివాసులు, ఆలయ కమిటీ చైర్మన్ ప్టిటల సురేష్, కమిటీ సభ్యులు బాలకృష్ణ, భరత్, అభిషేక్, శివ, కాంగ్రెస్ నాయకులు సంభు వెంకట్‌రమణ, జూలూరి సత్యనారా యణ, రహీం, తుల్చ్య, చరణ్, సైదులు, బాబ, వెంకట య్య, శివాజి, లోకనాథం,శోభ, జయమ్మ, ప్రభావతమ్మ పాల్గొన్నారు.
- తాడూరు: మం డల కేంద్రంలోని అయ్య ప్పస్వామి దేవాలయంతో పాటు మండలంలోని గుట్టలపల్లి, మేడిపూర్, సిర్సవాడ, ఐతోల్, యత్మ తాపూర్, గుంతకోడూరు తదితర గ్రామాల్లో సోమ వారం సంక్రాంతి పండు గను పురస్కరించుకుని భక్తులు ఉదయాన్నే త మ ఇళ్ల ముందు రంగ వల్లులను వేయడంతో పాటు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. సాయంత్రం వేళ ఎద్దుల బండ్లతో ట్రాక్టర్లను అందంగా అలంకరించుకుని ఆయా గ్రామాల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తో గోవిందానామస్మరణ మారుమోగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ సమద్‌పాష మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజే యగా జడ్పీటీసీ రోహిణి, ఎంపీపీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ శివలీల వారివారి గ్రామాల్లో సం క్రాంతి వేడుకలను ఘనంగా నిర్వ హించుకున్నారు.
- కల్వకుర్తి: పట్టణంలో సోమ వారం సాయంత్రం హనుమాన్ దే వాలయం వద్ద జరిగిన ఎడ్లబండ్ల ర్యాలీ ఆకట్టుకుంది. మునిసిపల్ చైర్మ న్ ఎడ్మ సత్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ రాచోటి శ్రీశైలం, మాజీ సర్పం చ్ బృంగి ఆనంద్‌కుమార్, పలువురు నాయకులు హాజరయ్యారు. ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై దేవాల యంలో పూజలు నిర్వహించారు. క ల్వకుర్తి మండల పరిధిలోని తాండ్రా గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాయితీ ఆశాదీప్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో ఉమామహేశ్వర ప్రభోత్సవం
అమ్రాబాద్: మండల కేంద్రంలోని అమరేశ్వర ఆల యం నుంచి ఉమామహేశ్వర ప్రభోత్సవాన్ని ఆలయ క మిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై భజ న కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతి యువకులు అర్ధరాత్రి వరకు సంద డి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. అమరేశ్వర ఆలయ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నేతలు భక్తులు పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు.