Share News

పాఠశాల తనిఖీ

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:46 PM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ఘనీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాల తనిఖీ
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో అబ్దుల్‌ఘనీ

దామరగిద్ద, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ఘనీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయ పాలన పాటించి విద్యార్థులకు మెరుగైన బోధనను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రార్థన సమయానికి వచ్చిన ఆయన విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్‌ అశోక్‌, ఉపాధ్యాయులు శంబులింగం తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:46 PM