అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎన్‌ఎల్‌ఎం బృందం పరిశీలన
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:26 PM
మూసాపేట మండలంలోని అచ్చాయిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్‌ఎల్‌ఎం టీమ్ పర్యటించి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసి పరిశీలించారు.
మూసాపేట, నవంబరు 6: మండలంలోని అచ్చాయిపల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో బుధవా రం (ఎన్‌ఎల్‌ఎం)నేషనల్ లేవల్ మానిటరింగ్ టీమ్ పర్యటించి ప్రభుత్వం ద్వారా అమలవుతు న్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసి పరిశీలించారు. మహిళా సం ఘాల సభ్యులతో మాట్లాడి స్వయం సహాయక సంఘాల సమావేశాల నిర్వహణ, ఎజెండా అం శాలు, సంఘాల ద్వారా రుణాలు పొంది చేపడు తున్న కార్యకలాపాలు, వాటి నిర్వహణతో వచ్చే లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్వ యం ఉపాధి రంగాల్లో మహిళాసంఘాల సభ్యు లు సాధించిన పురోగతిపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న రైతుల వదం రోజుల పనులు, ఈ పథకం ద్వారా చేపడుతున్న నర్సరీ పెంపకాలు, గ్రామీణ రోడ్లు, చెరువుల పూడికతీత, వాటర్‌షెడ్ నిర్మాణ పనులపై ఉపా ధి ఏపీవో పులిందర్‌ను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఆసరా ఫించన్లు, వాటర్‌షెడ్డు పనుల, ఉద్యానవన నిర్మాణాలు, పాలశీతలీకరణ కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షిం చారు. అచ్చాయిపల్లి పాఠశాలలో విద్యాప్రమాణా లు, మౌలిక వసతులపై పరిశీలించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ రాజు, ఎంపీడీవో కృష్ణయ్య, ఏపీవో అనురాధ, పంచాయతీరాజ్ డీఈ లక్ష్మణ్ గౌడ్, ఏపీడీ శ్రీపాధ్,ఏపీఎం వెంకటాచారి, ప్లాం టేషన్ మేనేజర్ సుస్మిత, ఏపీవో పులిందర్, పం చాయతీ కార్యదర్శులు సంతోషి, మహేందర్, ఉపాధి టీఏలు సుజిత, ఈశ్వర్, శ్రీనివాసులు మాజీ సర్పంచి సాయిరెడ్డి మండల నాయకులు ఆంజనేయులు, శ్రీనివాసులు ఉన్నారు.