సెప్టెంబరు 17 తెలంగాణకు విద్రోహమే
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:19 PM
సెప్టెంబరు 17 తెలం గాణకు విద్రోహ దినమే అని సీపీఐ (ఎంఎల్) పా ర్టీ డివిజన్ కార్యదర్శి సలీం, సీపీఐ మాస్‌లైన్ జిల్లా నాయకుడు కిరణ్ అన్నారు.
మక్తల్, సెప్టెంబరు 15 : సెప్టెంబరు 17 తెలం గాణకు విద్రోహ దినమే అని సీపీఐ (ఎంఎల్) పా ర్టీ డివిజన్ కార్యదర్శి సలీం, సీపీఐ మాస్‌లైన్ జిల్లా నాయకుడు కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలో ని అంబేడ్కర్ చౌరస్తాలో సెప్టెంబరు 17ను తెలం గాణకు విద్రోహ దినంగా పాటించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1948 సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిందన్నారు. అనేక సంవ త్సరాలుగా తెలంగాణ ప్రజలు, రైతులు కుల మ తాలకు అతీతంగా భూమి, భుక్తి, వెట్టిచాకిరీకి భూ స్వాములు, రజాకర్లు, నిజాం పోలీసుల దౌరజ్జాన్యా లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అనేక పోరా టా లు చేశారన్నారు. పది లక్షల ఎకరాల భూమిని కు ల మతాలకు అతీతంగా రైతులకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదే అన్నారు. తెలంగా ణను విముక్తి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నవాబును జైలులో వేశారని చెప్పడం అబద్దం అన్నారు. 1948 నుంచి 1952 వరకు హైదరాబాద్ గవర్నర్‌గా నియమించి నెలకు రూ.50 లక్షలు ఇచ్చారన్నారు. నిజాం, పటేల్ సైన్యం సహకారంతో తెలంగాణ పే దలను, రైతులను, కమ్యూనిస్టులను చిత్ర హింస లు చేసి 2500 ఎకరాల భూములను భూస్వాము లకు అప్పగించారన్నారు. ఐఎఫ్‌టీయూ ఉపాధ్యక్షు డు ఏజీ బుట్టో, మహిమూద్, రాజు, ఆంజనేయు లు, వెంకటేష్, మల్లేష్, అజయ్ పాల్గొన్నారు.
ఊట్కూర్ : సెప్టెంబరు 17 తెలంగాణ ప్రజా విముక్తి పోరాటం అయిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జరిగిన విద్రోహ దినం అని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం అన్నారు. ఆదివారం మండలంలోని బిజ్వార్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ - ముస్లింలు కలిసి నిజాంకు వ్యతిరేకంగా చేసిన ఐక్యత పోరాటా న్ని కొందరు చరిత్రను వక్రీకరించి హిందూ - ము స్లింల మధ్య పోరాటంగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఇది కులం, మతానికి వ్యతిరేకం కాదని, ఒక రాజుకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు చేసిన పోరాటం అన్నారు. పది లక్షల ఎకరాల భూమిని పంచి, వెట్టి చాకిరి రద్దు చేసి కౌలు రైతు లకు హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు. మూడు వేల గ్రామాలను బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, భూమిని పంచడం జరిగిందని వివరించారు. ఈ పోరాటానికి భయపడిన నిజాం పటేల్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత సాయుధ పోరాటాన్ని అణిచి వేయడానికి కారణం అయ్యారని, అందుకే నిజాం సైన్యం కంటే పోరాటం చేసి ప్రజలే అధిక మంది ప్రాణాలు కోల్పోవడం జరి గిందన్నారు. కాబట్టి ఇది ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినం అవుతుందన్నారు. కొత్తపల్లి గ్రామం లో మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్రోహ దినం ర్యాలీ నిర్వహించారు. మండల కార్య దర్శి రామాంజనేయులు, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నప్ప, డివిజన్ నాయకులు కృష్ణయ్య, రాజు, చిన్నబాలు, అంజప్ప, మల్లేష్, చంద్రాములు, తిరుమలేష్, నక్క రామాంజనేయులు, మల్లేష్, శేఖర్ పాల్గొన్నారు.