Share News

సర్వర్‌ డౌన్‌

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:59 PM

భవన నిర్మాణ రంగ కార్మికులు కార్మికశాఖ ద్వారా పొం దాల్సిన పథకాలకు దూరమయ్యే దుస్థితి నెలకొంది.

సర్వర్‌ డౌన్‌
వనపర్తి పట్టణంలో భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు

- నిర్మాణ రంగ కార్మికులకు తప్పని అవస్థలు

- 60 రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

- జిల్లా వ్యాప్తంగా 48వేల మంది కార్మికులు

- పథకాల అమలు కోసం ఎదురుచూపు

ఆత్మకూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ రంగ కార్మికులు కార్మికశాఖ ద్వారా పొం దాల్సిన పథకాలకు దూరమయ్యే దుస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలో 14 మండలాల్లో 48 వేల మంది కార్మికులు కార్మిక శాఖలో సభ్యత్వం తీసుకున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో భవన నిర్మాణ కార్మిక రంగ సంస్థలో సర్వర్‌ బంద్‌ అయ్యింది. ఇప్పటి వర కు రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించలేదు. దీంతో తెలం గాణ భవన నిర్మాణ కార్మికుల పథకాలన్నీ తెలంగాణ భవనం, ఇతర కన్‌స్ట్రక్షన్‌, వెల్ఫేర్‌ బోర్డు ఆధారంగా చేసుకుని అమలు అవుతున్నాయి. ఇందులో భాగంగా కార్మికులు సభ్యత్వ నమోదు.. ఇది వరకే నమోదు చేసుకున్న కార్మికులు రెన్యువల్‌ చేసుకోవడం ఆయా పథకాల కింద పరిహారం ప్రోత్సాహకాలను ఈ సర్వ ర్‌ ఆధారంగానే జరుగుతుంటాయి. 60 రోజులుగా సర్వర్‌ బంద్‌ కావడంతో జిల్లాలోని కార్మికుల నివేదిక లు, ఇతర సమాచారం సైతం తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రమాదవశాత్తు, సహజ మరణం, ప్రసూతి, పెళ్లి కానుక వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా అయ్యిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా సభ్యత్వ నమోదు చేసుకోవడం, రెన్యువల్‌ చేసుకోవ డానికి కూడా అవకాశం లేకుండా పోయిందని కార్మి కులు వాపోతున్నారు. తక్షణమే నిర్మాణరంగ సర్వర్‌ ను ఓపెన్‌ చేసి కార్మికరంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదు కోవాలని ఆయా కార్మిక సంఘాల నాయకులు కోరు తున్నారు. జిల్లాలో రెండు కార్యాలయాలు ఉండాల్సి ఉండగా వనపర్తి జిల్లాలో ఒకే కార్యాలయం ఉంది. సరిపడా ఉద్యోగులు లేకపోవడంతో కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఆలస్యం అవుతోం దని కార్మికలు వాపోతున్నారు. నిర్మాణ రంగంలో 36 రకాల పనులు చేస్తున్న కార్మికులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరికి తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఆయా రకాల సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చే స్తోంది. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖా స్తుల సంఖ్య 300కు పైగా ఉన్నాయి. అలాగే క్లెయిమ్స్‌ 250కి పైగా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకుని ఏడాదైనా క్లెయిమ్స్‌ డబ్బులు వచ్చే పరిస్థితి లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:59 PM