చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:40 PM
వ్యవసాయ విత్తనాలు, పురుగు మందుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, డిప్లొమా కోర్సుల్లో నేర్చుకున్న పరి జ్ఞానం రైతులకు ఉపయోగపడేలా కృషి చేయాలని డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన డీలర్లకు కలెక్టర్ బదావత్ సంతోష్ అభినందనలు తెలిపారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ విత్తనాలు, పురుగు మందుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, డిప్లొమా కోర్సుల్లో నేర్చుకున్న పరి జ్ఞానం రైతులకు ఉపయోగపడేలా కృషి చేయాలని డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన డీలర్లకు కలెక్టర్ బదావత్ సంతోష్ అభినందనలు తెలిపారు. శుక్రవారం నాగర్‌కర్నూ ల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేశీ శిక్షణలో భాగంగా డిప్లొమా కోర్సు పూర్తి చే సుకున్న 79మంది విత్తన డీలర్లకు సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్-దేశి పేరుతో అందించే ఈ కోర్సు కాల వ్యవధి ఒక ఏడాది. కేవలం డీలర్లను దృష్టిలో ఉం చుకుని రూపొందించిన కోర్సులకు పంటలకు ఉపయోగించే ఎరువులు, చీడపీడల ని వారణకు వాడే పురుగు మందులకు ప్రామాణికం ఏంటి, ఏ ప్రాతిపదికన వాటిని వి నియోగించాలి, విక్రయించే డీలర్లకు ఈ విషయంలో పూర్తి అవగాహన లేని పరిస్థితి వీటన్నింటికీ పరిష్కారం దిశగా దేశీ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించే డీలర్లకు వాటి అవసరం, వినియోగంపై శాస్త్రీయమైన అవగాహన కల్పించే లక్ష్యంతో డిప్లొమా కోర్సును కేంద్ర వ్యవసాయ శాఖ అందిస్తుందన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 446 ఎరువుల డీలర్లు, 556పురుగు మందుల డీలర్లు ఉ న్నారని తెలిపారు. విత్తనాల డీలర్లు రైతులకు అవినాభావ సంబంధాలు కలిగి ఉండి రైతులకు ప్రయోజనాలు చేకూరేలా ఎరువు మందుల వాడకం, విత్తనాలు నూతన వ్యవసాయ పద్దతులపై స్థానికంగా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల ని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవీ.రమేష్, ఉద్యాన శాఖ అధికారి జగదీశ్, మండల స్థాయి వ్యవసాయ అధికారులు, డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న డీలర్లు పాల్గొన్నారు.