వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:10 PM
గద్వాల తిరుపతిగా పేరు గాంచి నదీఅగ్రహారం శ్రీ కల్యాణ లక్ష్మీవెంక టేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం
గద్వాల టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గద్వాల తిరుపతిగా పేరు గాంచి నదీఅగ్రహారం శ్రీ కల్యాణ లక్ష్మీవెంక టేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు సాగే వివిధ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆది వారం పుణ్యాహవచనం, రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణం, గోవిందనామ స్మర ణ శాస్ర్తోక్తంగా సాగాయి. అనంతరం కృష్ణా నదీతీరం వద్ద గంగా హారతిని నిర్వ హించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో రా త్రి కోటి దిపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తిచేశారు. అనంతరం మహా మంగళహారతి నిర్వహిం చిన అర్చకులు కార్తీక మాసంలో నిర్వహిం చే శివ రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యా ణానికి ఉన్న విశిష్టతను వివరించారు. అ నంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.