Share News

ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:26 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని బీజేపీ నాయకుడు నాగూరావు నామా జీ అన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ

- బీజేపీ నాయకుడు నాగూరావు నామాజీ

- పార్టీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని బీజేపీ నాయకుడు నాగూరావు నామా జీ అన్నారు. శుక్రవారం పేట జిల్లా కేంద్రంలో శు క్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో నామాజీ మాట్లాడారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు... 66 మోసాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. గృహజ్యోతి పథకం పేరుతో మహిళలను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చెప్పుకునేందుకు లేక కేసీఆర్‌, నరేంద్రమోదీలపై విమ ర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పగ డాకుల శ్రీనివాస్‌, రాంచంద్రయ్య, వెంకట్రాములు, తిరుపతిరెడ్డి, నర్సింహులు, మల్లయ్య, మిర్చి వెంకటయ్య, గోపాల్‌యాదవ్‌, గోపాల్‌రావు, సా యిబణ్ణ, సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:26 PM