Share News

ఇలవేల్పు కురుమూర్తికి దాసంగాలు

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:26 PM

మండలంలోని అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి జాతర భక్తులతో కిటకిటలాడుతు న్నది.

ఇలవేల్పు కురుమూర్తికి దాసంగాలు
ఇంటి దేవుడు కురుమూర్తి రాయుడికి దాసంగం సమర్పిస్తూ మొక్కుతున్న ఓ కుటుంబం

- జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు

- కిటకిటలాడుతున్న మైదానం

చిన్నచింతకుంట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి జాతర భక్తులతో కిటకిటలాడుతు న్నది. గ్రామీణ ప్రాంతాల మహిళలు, చిన్నారులు తమ ఇలవేల్పును దర్శించుకునేందుకు కురుమ య్యా.. కరుణించవయ్యా, కురుమూర్తి రాయా.. గోవిందా.. గోవింద అంటూ కాలినడకన భక్తులు కురుమూర్తి కొండకు చేరుకుంటున్నారు. కోనేరు లో స్నానమాచరించి ఉద్దాలను, స్వామి వారిని, దర్శించుకుని పూజలు చేశారు. దాసంగాలు సమ ర్పించి మొక్కులుచెల్లించారు. వివిధ రకాలు దుకా ణాల ఏర్పాటు, ప్రముఖుల రాక, ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీతో ఇక్కడి ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

సీఎం రాక నేపథ్యంలో అడుగడుగునా నిఘా

చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ సమీ పంలో కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కురు మూర్తిస్వామి క్షేత్రం అంతా పోలీసుల భద్రతావలయంలోకి వెళ్లింది. డీఐజీ ఎల్‌ ఎస్‌ చౌహాన్‌, అడిషనల్‌ ఎస్‌పీ రాములు, డీఎస్‌ పీ వెంకటేశ్వర్లు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 700మందితో పోలీసులు భారీ బందోబ స్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్‌పీ రాములు జాతర మైదానంలోని పోలీసు ఔట్‌పోస్టులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం పర్యటన ఉదయం ఉన్నందున పోలీసులతో జాత ర మైదానం అంతా భద్రతను మరింత కట్టుది ట్టం చేశామన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:26 PM