Share News

ముమ్మరంగా సోమశిల హైవే పనులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:33 PM

కొట్ర గేటు నుంచి నంద్యాల జాతీయ రహదారి 167కే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయి.

ముమ్మరంగా సోమశిల హైవే పనులు
కొనసాగుతున్న ఎన్‌హెచ్‌167కే జాతీయ రహదారి పనులు

- ఐదు విభాగాల్లో ఎన్‌హెచ్‌167కే నిర్మాణం

- మొదటి విడతలో 79కిలో మీటర్లకు గాను 49 కిలో మీటర్ల బీటీ పూర్తి

కల్వకుర్తి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కొట్ర గేటు నుంచి నంద్యాల జాతీయ రహదారి 167కే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయి. మొత్తం ఐదు విభాగాల్లో పనులు జరుగుతున్నా యి. రాష్ట్రంలో మొదటి విభాగం లో కొట్ర గేటు నుంచి సోమశిల వరకు ఉండగా.. రెండో విభాగంలో సోమశిల వంతెన అప్రోచ్‌, మూడో విభాగం తీగల వంతెన ఉండగా, మిగతా నాలుగు, ఐదు విభాగాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మొదటి విభాగంలో కొట్ర గేటు నుంచి సోమశిల వరకు రూ.401 కోట్లతో 79.3కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మా ణ పనులు ముమ్మరంగా కొన సాగుతున్నాయి. అందులో 49కిలో మీటర్ల వరకు 100ఎంఎం బీటీ పూర్తి కాగా ఫైనల్‌ పనులు జరగాల్సి ఉంది.

ఎన్‌హెచ్‌167కే లో మూడు బైపాస్‌లు

కొట్ర గేటు సోమశిల ఎన్‌హెచ్‌ 167లో భాగంగా కల్వకుర్తి బైపాస్‌ 10.5కిలో మీటర్లు, నాగర్‌కర్నూల్‌ బైపాస్‌ 11కిలో మీటర్లు, కొల్లా పూర్‌ బైపాస్‌ నాలుగు కిలో మీటర్లు ఉంది. కాగా కల్వ కుర్తి బైపాస్‌ పనులు జరుగుతున్నాయి. కొల్లాపూర్‌ బైపాస్‌ నిర్మాణానికి భూ సేకరణ జరగగా నాగర్‌ కర్నూల్‌ బైపాస్‌ నిర్మాణానికి భూసేకరణ జరగ లేదు. దీంతో అక్కడ పనులు ప్రారంభం కాలేదు. కల్వకుర్తి మండలం సుద్దకల్‌ సమీపంలో దుందుభీ నదిపై మేజర్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ బైపాస్‌ వద్ద మేజర్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు భూసేకరణ లేకపోవ డంతో ప్రారంభం కాలేదు. ఎన్‌హెచ్‌ 167కే లో మైనర్‌ బ్రిడ్జిలు 12, స్లాబ్‌ కల్వర్టులు 9, పైపు కల్వ ర్టులు 22 ఉండ గా వెహికిల్‌ అండర్‌పాస్‌లు నాలుగు ఉన్నాయి. అందులో కల్వకుర్తి-1, నాగర్‌ కర్నూల్‌-1, కొల్లాపూర్‌-2 నిర్మాణాలు జరగాల్సి ఉంది. బీటీ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండడంతో రాకపోకలకు ఇబ్బంది తప్పుతుం దని ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అభిప్రా యపడు తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:33 PM