Share News

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 30 , 2024 | 11:13 PM

ప్రజావాణి కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌ తెలిపారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్‌, ఎస్పీ

గద్వాల న్యూటౌన్‌/గద్వాల క్రైం, సెప్టెంబరు 30: ప్రజావాణి కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42మం ది నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించామని తెలిపారు. అధికారులు ప్ర త్యేక దృష్టిసారించి సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాసరావు, నర్సింగరావు, ఆర్డీవో రాంచందర్‌, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

గద్వాల క్రైం: ప్రజల ఫిర్యాదుల్లో వాస్తవాలను పరిశీలించి త్వరగా సమస్య లు పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి 11 ఫిర్యాదులు అందాయని, వీటిలో భూ వివాదాలకు సంబంధించి ఆరు, ప్లాట్ల కబ్జాకు సంబంధించి రెండు, ఇతర అంశాలపై మూడు ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో పరిశీలించి వేగంగా బాధితలకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

Updated Date - Sep 30 , 2024 | 11:13 PM