Share News

ఇష్టారీతిన ఎస్‌ఏ-1 పరీక్షలు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:36 PM

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసె్‌సమెంట్‌-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం అన్ని పాఠశాలల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి పరీక్షల విభాగం రూపొందించిన ప్రశ్నపత్రాలను ఉపయోగించి పరీక్షలు నిర్వహించాలి. కానీ, కేవలం ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో మాత్రమే అది అమలవుత్నుది. ప్రైవేట్‌ పాఠశాలలు ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు.

ఇష్టారీతిన ఎస్‌ఏ-1 పరీక్షలు
జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమీపంలో గల వేంకటేశ్వర కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌ఏ-1 పరీక్ష రాస్తున్న విద్యార్థులు

నిబంధనలను పట్టించుకోని ప్రైవేట్‌ పాఠశాలలు

విద్యార్థుల నుంచి అదనపు ఫీజు వసూలు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసె్‌సమెంట్‌-1 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం అన్ని పాఠశాలల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి పరీక్షల విభాగం రూపొందించిన ప్రశ్నపత్రాలను ఉపయోగించి పరీక్షలు నిర్వహించాలి. కానీ, కేవలం ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో మాత్రమే అది అమలవుత్నుది. ప్రైవేట్‌ పాఠశాలలు ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఉమ్మడి పరీక్షల విభాగం రూపొందించిన ప్రశ్నపత్రాలు కాకుండా వేరే ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అది కూడా విద్యాశాఖ సూచించిన సమయంలో కాకుండా తమకు అనుకూలంగా ఉన్న సమయంలో పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ ప్రైవేట్‌ పాఠశాలల వైపు చూడటం లేదు. మరోవైపు విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా ఫీజులు వసులు చేస్తున్నారని కొందరు ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తెచ్చారు. దాంతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం పలు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి పరిశీలించింది. ఉమ్మడి పరీక్షల విభాగం తయారు చేసిన ప్రశ్నపత్రాల ద్వారానే పరీక్షలు నిర్వహిస్తున్నారా? అని ప్రిన్సిపాల్‌లను ఆరా తీసింది. దానికి వారు తాము తయారు చేసుకున్న ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయమై ఓ ప్రైవేట్‌ పాఠశాల నుంచే డీఈవో రవీందర్‌కు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ చేసి మాట్లాడింది. అందుకు ఆయన తప్పనిసరిగా ఉమ్మడి పరీక్ష విభాగం ప్రశ్నప్రతాలనే వాడాలని ఆ పాఠశాల యాజమాన్యానికి సూచించారు. అయినా పట్టించుకోకుండా వారి ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:36 PM