Share News

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:42 PM

పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పో రాటం కొనసాగిస్తామని చైతన్య మహిళా సం ఘం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి అన్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం
పాతబస్టాండ్‌ వద్ద ఆందోళన చేస్తున్న నాయకులు

- సీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి

- ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ధర్నా

గద్వాల టౌన్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పో రాటం కొనసాగిస్తామని చైతన్య మహిళా సం ఘం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి అన్నారు. బాలిక మృతికి కారకుడైన సీడ్‌ ఆర్గనైజర్‌ బండ్ల రాజశే ఖర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ప్ర జా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. నిందితులను తప్పించే ందుకు జిల్లాకు చెందిన పోలీసు అధికారులు చే స్తున్న ప్రయత్నం సిగ్గుచేటన్నారు. పోలీసులు, అధికారులు తమ వైఖరిని మార్చుకోకుంటే ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సీపీ ఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వెంకటస్వామి, ఆంజనేయులు, టీపీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభా కర్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి మద ్దతుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేస్తామని చెప్పినా, పోలీసులు అనుమతి లేదంటూ అడ్డు కునే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమ న్నారు. కార్యక్రమంలో వెంకట్రాములు, శ్రీదేవి, జయమ్మ, రేణుక, అరుణ, సుభాన్‌, వాల్మీకి, వి నోద్‌, ప్రవీణ్‌, ఆంజనేయులు, కుమార్‌, కిష్టన్న ఉన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:42 PM