Share News

రోడ్డెక్కిన విద్యార్థులు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:36 PM

వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ ఇం జనీరింగ్‌ కళాశాల విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు.

రోడ్డెక్కిన విద్యార్థులు
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని రహదారిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు

- మౌలిక వసతులు కల్పించాలని బైఠాయింపు

వనపర్తి రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ ఇం జనీరింగ్‌ కళాశాల విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు. కనీస వసతులు కల్పించడం లేదని కళాశాలకు సమీపంలోని ప్రధాన రోడ్డుపై బైఠా యించి ఆందోళన చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి దగ్గర ఇంజనీ రింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ, కనీస వసతులు, నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ పైకోర్సులకు నెట్టుకొస్తున్నారు. సరిపడా భవనంలేక విద్యార్థు లతో కిక్కిరిసిపోవడంతో రెండు నెలల కిందట వనపర్తి పట్టణంలోని ఓ పాత హాస్పిటల్‌ను బాలికల హాస్టల్‌గా, అక్కడే దగ్గరలో గల జిమ్ము ను బాయ్స్‌ హాస్టల్‌గా మార్చారు. కానీ, హాస్టళ్లలో మౌలిక వసతులు లేవు, ఒక్కో గదిలో ఏడు, ఎనిమిది మందిని ఉంచుతున్నారు. భోజనం నాణ్యతగా లేకుండా నీళ్ల చారు పోస్తున్నారని, అన్నం, సాంబార్‌, పప్పులో బొద్దింకలు, వెం ట్రుకలు కనబ డుతున్నాయని, ప్రిన్సిపాల్‌కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠా యించిన విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్‌ వచ్చి సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేదిలేదని విద్యార్థులు భీష్మిం చి కూర్చున్నారు. ఆందోళనకు ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ అర్జున్‌, నాయకులు బాలకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చురాం మద్దతు పలికారు. ఆర్డీవో పద్మావతి వచ్చి సమస్యలను అధికారులతో మాట్లాడి వారం పది రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడంతో శాంతించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:36 PM