Share News

సూపర్‌వైజర్లు తిన్నాకే వడ్డించాలి

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:26 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం వండిన మధ్యా హ్న భోజనాన్ని సూపర్‌వైజర్లు తిన్న తరువాత విద్యార్థులకు వడ్డించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు.

సూపర్‌వైజర్లు తిన్నాకే వడ్డించాలి
- విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

రేవల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం వండిన మధ్యా హ్న భోజనాన్ని సూపర్‌వైజర్లు తిన్న తరువాత విద్యార్థులకు వడ్డించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. బుధవారం ఆయన వన పర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని కేజీబీ వీ, తల్పునూరులో జడ్పీహెచ్‌ఎస్‌, ధాన్యం కొ నుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థు లకు ఇబ్బంది లేకుండా మరుగు దొడ్ల నిర్మా ణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించా రు. ముందుగా సూపర్‌వైజర్లు తిన్న తరువాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించా రు. అదేవిధంగా రేవల్లి కేజీబీవీలో స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. వంట సరకుల వివ రాలు రిజిస్టర్లలో నమోదు చేయాలని, విద్యార్థు ల సమక్షంలో సరకులు దించుకోవాలని సూ చించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజ నం చేశారు. అంతకు ముందు తలుపునూరు లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతు లకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసు కోవాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధా న్యాన్ని తూకం చేసి వెంటనే లోడు చేయించా లని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చిన రైతుల పేర్లు రిజిస్టర్ల లో వరుసగా నమోదు చేయాలని సూచించా రు. రిజిస్టర్‌ లేదని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రంలోగా మండలంలోని అన్ని కేంద్రా లలో రిజిస్టర్లు ఏర్పాటు చేసి మాకు తెలియ జేయాలని ఏపీఎం సావిత్రమ్మను ఆదేశించా రు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో యాదయ్య, తహసీల్దార్‌ లక్ష్మిదేవి, ఎంపీడీవో నరసింహరెడ్డి, అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 11:26 PM