సర్వే పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి :కలెక్టర్
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:22 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సామాజిక సర్వేపై నిర్లక్ష్యం చేయకుండా సర్వే ప త్రాలను జాగ్రత్తగా ఉంచాలని కలెక్టర్ విజయేంది ర బోయి సూచించారు.
- మల్కాపూర్‌లో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కోయిలకొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సామాజిక సర్వేపై నిర్లక్ష్యం చేయకుండా సర్వే ప త్రాలను జాగ్రత్తగా ఉంచాలని కలెక్టర్ విజయేంది ర బోయి సూచించారు. బుధవారం మండలంలో ని మల్కాపూర్‌లో ఆర్థిక, సామాజిక సర్వేను పరి శీలించారు. అధికారులు సర్వే నిర్వహిస్తుండగా కలెక్టర్ వాటిని పరిశీలించారు. ఇంతలో సర్వేపత్రా లు చిందర వందరగా పడడంతో కలెక్టర్ అధికా రులపై అసహనం వ్యక్తం చేశారు. సర్వేపత్రాలు జాగ్రత్తగా ఉంచాలని తెలియదా అని ప్రశ్నించా రు. సర్వే గురించి మండల అధికారులతో మా ట్లాడి పలు వివరాలు తెలుసుకొన్నారు. అనంత రం మండలంలోని ఆచార్యపూర్‌లో వరి కొనుగో లు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహ సీల్దార్ రాజా గణేశ్, ఎంపీడీవో కాళప్ప, ఎంఈవో వెంకట్‌జీ, సర్వే సూపర్‌వైజర్ సంధ్యారాణి, ఏపీ ఎం మల్లేష్ ఉన్నారు.
సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
భూత్పూర్ (ఆంధ్రజ్యోతి): మండలంలో 47మంది ఎన్యుమరేటర్లు 18 గ్రామ పం చాయతీల్లో ఇంటింటికీ తిరుగుతూ స్టిక్క ర్లు వేశారు. మునిసిపాలిటీ పరిధిలోని 10వార్డుల్లో 23మంది సర్వే పనుల్లో పా ల్గొన్నారు. మొత్తం 70మంది ఎన్యుమరే టర్లు, ఏడుగురు సూపర్‌వైజర్లుగా పని చేశారు. ఈసందర్భంగా రెవె న్యూ శాఖ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు మం డలంలోని అన్నాసాగర్, పోతులమడుగు లో సర్వేను పరిశీలించారు. అంతకుముం దు అన్నాసాగర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని వ్య వసాయ శాఖ ఏవో మురళీధర్‌తో కలిసి పరిశీలిం చారు. సర్వేను మండల ప్రత్యేకాధికారి వేణుగోపా ల్, ఎంపీడీవో ప్రభాకరచారి, తహసీల్దార్ రహ మాన్ సూపర్‌వైజర్లుగా పర్యవేక్షించారు.
జడ్చర్ల మండలంలో జడ్పీ సీఈవో
జడ్చర్ల (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల మున్సిపాలిటీ, మండలంలో బుధవారం సర్వే ప్రారంభమైంది. మల్లెబోయిన్‌పల్లి, జడ్చర్ల మున్సిపాలిటీలోని కొత్త తండాలలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి సర్వే ప్రక్రి యను పరిశీలించారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 18వేల ఇళ్లు ఉన్నాయని, 121 బ్లాక్‌గా ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తెలిపా రు. సర్వేలో 121మంది ఎన్యుమరేటర్‌లు, 12మం ది సూపర్‌వైజర్‌లు పాల్గొన్నారని తెలిపారు. జడ్చ ర్ల మండలంలో 15,228 ఇళ్లు ఉన్నాయని, 106 మంది ఎన్యుమరేటర్‌లు 10మంది సూపర్‌వైజ ర్‌లను నియమించినట్లు ఎంపీడీవో విజయ్‌కుమా ర్ తెలిపారు.