Share News

11వ ప్రపంచ వ్యవసాయ గణన పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 11:27 PM

11వ ప్రపంచ వ్యవసాయ గణన జిల్లా వ్య వసాయశాఖ ఏఈవోలు, మండల గణాంక అధికారులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ప్రణాళిక అధికారి యోగానంద్‌, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌, డిప్యూటీ గణాంక అధికారి నర్సింహులు అన్నారు.

11వ ప్రపంచ వ్యవసాయ గణన పకడ్బందీగా చేపట్టాలి
శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న డిప్యూటీ గణాంక అధికారి నర్సింహులు

- జిల్లా ప్రణాళిక అధికారి యోగానంద్‌

నారాయణపేట, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): 11వ ప్రపంచ వ్యవసాయ గణన జిల్లా వ్య వసాయశాఖ ఏఈవోలు, మండల గణాంక అధికారులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ప్రణాళిక అధికారి యోగానంద్‌, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌, డిప్యూటీ గణాంక అధికారి నర్సింహులు అన్నారు. శనివారం నారాయణ పేట కలెక్టరేట్‌లో జిల్లాలోని వ్యవసాయ మండల అధికారులు, ఏఈవోలు, మండల గణాంక అధికా రులకు 11వ ప్రపంచ వ్యవసాయ గణన శిక్షణ కార్యక్రమంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చి పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. గ తంలో 2021-22 సంవత్సరంలో జిల్లాలో రైతులు ఏఏ పంటలు పండించారనే అంశంపై ఏఈవోలు యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసి వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఎరువుల వినియోగం, పంటల దిగుబడిని పరిగణనలోకి తీసు కోవాలన్నారు. ఫేజ్‌-1,2,3లలో వివిధ అంశాలపై సర్వే చేసి ఈనెలాఖరులోపు గణాంక శాఖకు నివేదికలు అందించాలని యోగానంద్‌ సూచిం చారు.

Updated Date - Dec 07 , 2024 | 11:27 PM