అక్రమార్జనే ధ్యేయం
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:04 AM
ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మా రుతున్నాయి.
- ప్రభుత్వ కార్యాలయాల్లో పెరుగుతున్న లంచావతారులు
- ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నా మారని ఉద్యోగులు
- తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ గద్వాల ఇన్‌చార్జి డీఈవో
వ్యవహారంపై చర్చ !
అయిజటౌన్: నవంబరు 8, (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మా రుతున్నాయి. ప్రజలకు ఏ పని కావాలన్నా కార్యాలయాల్లో చేతులు తడపాల్సిన పరిస్థితులు ఉన్నాయంటే ఆయా కార్యాలయాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు ఎంత అవినీతి కి అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ప్ర తినిత్యం వివిధ రకాల పనుల కోసం ప్రభు త్వ కార్యాలయాలకు వచ్చే సామన్యుడి నుం చి కోటీశ్వరుడి వరకు చేతులు తడపందే ఫైళ్లు కదలవనేది అక్షర సత్యంగా మారింది. ఏసీబీ దాడుల్లో పట్టుబడినా లంచావతారుల తీరు మాత్రం కుక్క తోక వంకర అన్న చందంగా ఉంది. తాజాగా గద్వాల జిల్లాకు ఇన్‌చార్జి విద్యాధికారిగా వ్యవహరిస్తున్న రవీందర్ గురువారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం చర్చనీయాంశం అయ్యింది. లంచం తీసుకోవటం నేరం అని బడు ల్లోని చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పే విద్యావస్థలోనే డీఈవో స్థాయి అధికారి లంచం తీసుకోవటంపై విస్మయం కలుగుతుంది. ఈ విధంగానే అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగి, కార్యాలయాలకు సామాన్యులు రావాలంటేనే లంచం ఇవ్వాలనే భావన ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా ఏసీబీకి పట్టుబడ్డ ఉద్యోగులు మచ్చుకు కొందరు... 2022 సంవత్సరం జనవరిలో మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి 1 ఎకరం ఏడు గుంటల భూమిని విరాసత్ చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అదే ఏడాది ఏప్రిల్ నెలలో కల్వకుర్తి విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అధికారి ట్రాన్స్‌ఫార్మర్ పనికోసం ఒక లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 2024 సంవత్సరం జనవరిలో అయిజ పట్టణంలో ఇంటిముందు ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ ఉద్యోగి ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదే నెలలో కల్వకుర్తి ఆర్‌డీవో కార్యాలయంలో ఓ ఉద్యోగి భూమి పంచనామా చేసిన పత్రాలు రైతు కు అందించేందుకు రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చి క్కాడు. అదే ఏడాది ఫిబ్రవరి నెలలో మహబూబ్‌నగర్ పురపాలిక శాఖలో ఒక ఉద్యోగి రెండు పనులకు ఎంబీలు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు దొరికారు. మార్చిలో నారాయణపేట జిల్లా, గుండుమాల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగి ఒకరు రైతు వద్ద మూడు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. జూన్ నెలలో వనపర్తి జిల్లాకు చెందిన విద్యుత్ అధికారుల ముగ్గురు కొత్తకోట మండలానికి చెందిన రైతువద్ద ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ, 19 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఉన్నతాధికారులు వారి కిందిస్థాయిలో పనిచేసే ఉద్యోగులతో లంచండిమాండ్ చేసి, అగ్రిమెంట్ కుదుర్చుకున్న తరువాత పనిచేయించుకున్న అనంతరం వ్యక్తులు, వ్యాపారులు నుంచి డబ్బులు వసూలుచేయిస్తారనే ప్రచారం ఉంది. చిన్న ఉద్యోగి అయినా, పై స్థాయి ఉద్యోగి అయినా లంచం తీసుకోవటం నేరము కాబట్టి చట్టం పరిధిలో కఠినంగా శిక్షింపబడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల్లో అవగాహన పెరగాలి
అవినీతిని అంతంమొందించే విషయంపై ప్రజలల్లో అవగాహన పెరగాలి. ఇప్పుడిప్పుడే ప్రజలు చైతన్యం అవుతున్నారు. ఇంకా చైతన్యం కావలసిన అవసరం ఉంది. గతేడాదికంటే ఈ ఏడాది కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రజలు అవినీతిని వ్యతిరేకిస్తున్నట్లుగా సృష్టమవుతోంది.
- కృష్ణగౌడు, ఏసీబీ డీఎస్పీ