Share News

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:39 PM

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

- వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడికి ఖండన

- కలెక్టరేట్‌లో రెవెన్యూ, టీఎన్‌జీవోస్‌, టీజీవోస్‌ల నిరసన

నాగర్‌కర్నూల్‌టౌన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఆ జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ని జిల్లా రెవెన్యూ, టీఎన్‌జీవోస్‌, టీజీవోస్‌ ఉద్యోగులు ఖండించారు. కలెక్టరేట్‌లో రెవె న్యూ, టీఎన్‌జీవోస్‌, టీజీవోస్‌ ఉద్యోగులు మంగళవారం నల్ల బాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దాడిచేసిన వ్యక్తులను కఠి నంగా శిక్షించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ఉద్యోగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉ న్న ఉన్నతాధికారులపై క్రిమినల్స్‌ తరహా లో మూకుమ్మడిగా దాడి చేయడం శోచనీయమ న్నారు. ఇటీవలే కాలంలో రెవెన్యూ ఉద్యో గులపై దాడులు నిత్యకృత్యమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించి మరో మారు ఇలాంటి సంఘటనలు పున రావృతం కాకుండా ప్రభుత్వ ఉద్యో గులకు రక్షణ కల్పించేలా కఠిన చ ట్టాలు అమలు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అదనపు కలె క్టర్‌ కె.సీతారామారావు, డీర్డీవోలు, తహసీల్దార్లు, టీజీవోస్‌ జిల్లా అసో సియేట్‌ ప్రెసిడెంట్‌ ఖాజా మైనుద్దీన్‌, రెవెన్యూ ఉద్యోగులసంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నకిష్టన్న, టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 11:39 PM