Share News

అజ్మీర్‌ దర్గాపై వివాదం సరికాదు

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:33 PM

రాజస్థాన్‌లో అజ్మీర్‌ షరీఫ్‌ దరా ్గపై వివాదం తీసుకురావడం సరికాదని ముస్లిం సంఘాల ప్రతినిధులు అన్నారు.

అజ్మీర్‌ దర్గాపై వివాదం సరికాదు
జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్న ముస్లింలు

- బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ కల్పించాలి

- ముస్లిం సంఘాల నాయకుల డిమాండ్‌

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో అజ్మీర్‌ షరీఫ్‌ దరా ్గపై వివాదం తీసుకురావడం సరికాదని ముస్లిం సంఘాల ప్రతినిధులు అన్నారు. మిల్లీ మహజ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్‌ అనంతరం క్లాక్‌టవర్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గ తంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల మసీ దులపై కావాలనే వివాదాలు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అజ్మీర్‌ దర్గాకు ప్రతి రోజు వేలాది మంది కులమతలకు అతీతంగా భ క్తులు దర్శించుకుంటారని అన్నారు. ముస్లిం మ నోభావాలను కేంద్రప్రభుత్వం గుర్తించాలని విజ్ఞ ప్తి చేశారు. అదే విధంగా బంగ్లాదేశ్‌లో మైనా ర్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండి స్తున్నాట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖాజా ఫ యాజుద్దీన్‌, తఖీహుస్సేన్‌, ఖుద్దుస్‌బేగ్‌, హాఫిజ్‌ ఇద్రీస్‌, అబ్దుల్‌హదీ, జాకీర్‌, మోసీన్‌ఖాన్‌, సాద తుల్లాహుస్సేని, జాఫర్‌షా పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:33 PM