గ్రామీణుల ఆరోగ్యానికి పెద్దపీట
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:34 PM
ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
మూసాపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతనంగా మంజూరైన 108 అంబులెన్స్‌ను, అడ్డాకుల మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో 102 అంబులెన్స్‌ను సోమవారం ప్రారంభించి, మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్షాళన చేస్తూ ఏడాది కాలంలోనే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. సర్కారు ఆసుపత్రుల్లో మందులు, సిబ్బంది, సకల సౌకర్యాలను సమకూర్చి ప్రజలకు అందుబాటులోనే మెరుగైన వైద్యం అందిస్తోందన్నారు. అదే విధంగా పేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు చేపడుతున్నామని, అర్హులైన ప్రతీ ఒక్కరికి అభివృద్ధి పథకాలు తప్పకుండా అందజేస్తామన్నారు. మూసాపేట, అడ్డాకుల జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగాత్రులకు సకాంలో వైద్యం చేయించి విలువైన ప్రాణాలను కాపాడటానికి కొత్తగా రెండు అంబులెన్సులు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆరోగ్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మూసాపేట, అడ్డాకుల కాంగ్రెస్ మండల అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, తోట శ్రీహరి, కిసాన్ మోర్చా జిల్లా అఽఽధ్యక్షుడు కారెడ్డి నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు నాగార్జునరెడ్డి, బగ్గి కృష్ణయ్య, మండల నాయకులు జగదీశ్వర్, గంగుల విజయమోహన్‌రెడ్డి, షఫీ అహ్మద్, కృష్ణయ్య, దశరథరెడ్డి, శరత్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేష్ పాల్గొన్నారు.