రుణ లక్ష్యాన్ని 20లోగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:40 PM
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు.
యువతకు బ్యాంకర్లు ఉపాధి రుణాలు ఇవ్వాలి
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలన్యూటౌన్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 21న వనపర్తి జిల్లాకు ముఖ్యమంత్రి రానున్నారని, ఈ సంద ర్భంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకు రుణాలను అందజేయనున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గద్వాల జిల్లా నిరుద్యోగ యువతకు బ్యాంకర్లు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి, ఎస్‌ఎంఈ పథకాల ద్వారా విరివిగా రుణాలు అందించాలని సూచించారు. ఈ ఏడాది సెప్టెంబరు 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ బ్యాంకల్లో అందించిన రుణాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు కేటాయించిన రూ.100 కోట్ల రుణ లక్ష్యాన్ని ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో రుణమేళా, జాబ్‌మేళా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎల్డీఎం అయ్యపురెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్‌బాబు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఉన్నారు.