Share News

మార్కెట్‌ కొత్త విధానాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:20 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్‌ కొత్త విధానాన్ని ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా పేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధాన ముసాయిదా ప్రతులను ఏఐపీకేఎస్‌ నాయకులు సోమవారం దహనం చేశారు.

మార్కెట్‌ కొత్త విధానాన్ని ఉపసంహరించుకోవాలి
నారాయణపేటలో ముసాయిదా ప్రతులను దహనం చేస్తున్న వివిధ సంఘాల నాయకులు

- ముసాయిదా ప్రతుల దహనం

- రైతు వ్యతిరేక విధానాలపై రైతు, కార్మిక సంఘాల నిరసన

- కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపాటు

నారాయణపేట రూరల్‌/మక్తల్‌/దామరగిద్ద, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్‌ కొత్త విధానాన్ని ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా పేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధాన ముసాయిదా ప్రతులను ఏఐపీకేఎస్‌ నాయకులు సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి, అంజిలయ్యగౌడ్‌, సలీం, గోపాల్‌లు మాట్లాడుతూ ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ బిల్లును తెచ్చి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం తగదన్నారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు చెన్నారెడ్డి, బాల్‌రాం, ప్రశాంత్‌, వెంకట్రాములు తదితరులున్నారు.

అదేవిధంగా, మక్తల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక అగ్రి మార్కెటింగ్‌ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు మాట్లాడారు. నాయకులు ఏజీ బుట్టో, రాజు, పీడీఎస్‌యూ భాస్కర్‌, రైతు సంఘం నాయకులు గోపాల్‌, మల్లేష్‌, మారెప్ప, నాగప్పలు పాల్గొన్నారు.

దామరగిద్దలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సం ఘాల ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు అంజిలయ్యగౌడ్‌, గోపాల్‌ మాట్లాడారు. జోషి, శివకుమార్‌, నర్సింహులు, రాములు, మొ గులప్ప, కనకప్ప, మహేష్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంతబజార్‌ సెంటర్‌లో ప్రగతిశీల రైతు సంఘం నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్దింటి తాయప్ప, దామరగిద్ద, ఉడ్మల్‌గిద్ద, సజనాపూర్‌, మద్దెల్‌బీడ్‌ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:20 PM