Share News

ప్లాటు అమ్మగా వచ్చిన డబ్బులు క్షణాల్లో మాయం

ABN , Publish Date - Nov 07 , 2024 | 11:03 PM

అవసరాల నిమిత్తం ప్లాట్‌ను అమ్మగా ఆ వచ్చిన డబ్బులను కారు లో పెట్టి మధ్యాహ్నం కావడంతో భోజనం చేద్దామని హోటల్‌ ముందు కారు పెట్టి తండ్రి, కొడుకులు భోజ నం చేస్తుండగా దొంగలు కారు అద్దాన్ని పగులకొట్టి అందులో ఉన్న రూ. 3,60 లక్షలను దొంగలించిన సంఘటన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదురుగా గురువారం చోటు చేసుకొంది.

ప్లాటు అమ్మగా వచ్చిన డబ్బులు క్షణాల్లో మాయం
కారు అద్దాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌

- కారులో పెట్టి భోజనం చేస్తుండగా అద్దం పగులకొట్టి చోరీ

- రూ. 3.60 లక్షలను ఎత్తికెళ్లిన దొంగలు

గద్వాల క్రైం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): అవసరాల నిమిత్తం ప్లాట్‌ను అమ్మగా ఆ వచ్చిన డబ్బులను కారు లో పెట్టి మధ్యాహ్నం కావడంతో భోజనం చేద్దామని హోటల్‌ ముందు కారు పెట్టి తండ్రి, కొడుకులు భోజ నం చేస్తుండగా దొంగలు కారు అద్దాన్ని పగులకొట్టి అందులో ఉన్న రూ. 3,60 లక్షలను దొంగలించిన సంఘటన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదురుగా గురువారం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం ఇమాంపురం గ్రామానికి చెందిన జితేందర్‌, ఆయన తండ్రి సిద్దప్పలు గద్వాల పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ప్లాటును వినోద్‌ అనే వ్యక్తికి విక్రయించే క్రమంలో గురువారం కారులో గద్వాలకు వచ్చారు. అయితే మొదట రూ. లక్ష అడ్వాన్స్‌గా తీసుకొని రిజిస్ట్రేషన్‌ ఆయ్యాక మిగిలిన రూ. 3.60 లక్షలు ఇచ్చి వినోద్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అతడి నుంచి తీసుకున్న రూ. 3.60 లక్షలు ఉన్న బ్యాగును కారులో ఉంచి మధ్నాహ్నం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న భా గ్యలక్ష్మి హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే వారు భోజనం చేస్తు న్న సమయంలో కొందరు దొంగలు కారు అద్దాన్ని పగులుకొట్టి అందులో ఉన్న నగదును ఎత్తికెళ్లారు. భోజనం తర్వాత కారు దగ్గరకు వచ్చిన తండ్రి, కుమారు డు కంగుతిని కారులో ఉన్న బ్యాగును చూడగా అందులో ఉన్న డబ్బును చోరీ చేసినట్లు గమనించారు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇ వ్వగా పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ సంఘటన స్ధలానికి వచ్చి పరిశీలించారు. సీసీ కెమరాల ఆధారంగా దొంగలను పట్టుకుంటామని ఎస్‌ఐ బాధితులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 07 , 2024 | 11:03 PM