Share News

ఉపాధి కల్పనే ధ్యేయం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:31 PM

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడయే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్‌, టూరిజం, పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.

ఉపాధి కల్పనే ధ్యేయం
నాగర్‌కర్నూల్‌లో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- నిరుద్యోగ యువతకు బ్యాంకు రుణాలు

- ఉపాధి కోసమే స్కిల్‌ సెంటర్లు

- ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి జూపల్లి

- జిల్లా కేంద్రంలో సంక్షేమ పథకాలపై అవగాహన

- హాజరైన మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులు

నాగర్‌కర్నూల్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడయే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్‌, టూరిజం, పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేం ద్రంలోని తేజ కన్వెన్షన్‌లో ఎంపీ డాక్టర్‌ మల్లు రవి ఆధ్వ ర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకు ళ్ల రాజేష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, అతిథులు గా ఎమ్మెల్యేలు డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబెదుల్లా కొత్వాల్‌, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవ కాశాలపై పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యో గ యువతకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు. ప్రతీ యువత అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా, నైపుణ్యాలు పెంపొందించుకోవాల న్నారు. ప్రతీ నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉద్యోగ కల్పనపై అవగాహన కల్పించేందుకు రూ.50 లక్షలు తన నిధుల తో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు కలెక్టర్లు ప్రతీ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశా లపై సమాచారంతో ఒక పుస్తకం రూపొందించాలని సూచించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రతీ నిరుద్యోగ యువత ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించేలా ప్రజా ప్రతినిధులందరం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దేశంలోని ప్రముఖ విద్యారంగ సంస్థల ప్రతినిధులతో స్థానిక అవార్డు స్వచ్చంధ సంస్థ సహకారంతో అవగాహన సదస్సు నిర్వ హించామని అన్నారు. పార్లమెంటు పరిధిలో సీఎస్‌ఆర్‌ జిల్లాకు ఒకటి చొప్పున స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేసేం దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, పార్లమెంటు పరిధిలోని మూడు జిల్లాల ఉన్నతా ధికారులు, అధికారు లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:31 PM