Share News

సమస్యపై పోరాడితేనే పార్టీ బలపడుతుంది

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:11 PM

ప్రజల సమస్యలపై నిత్యం పోరాడితేనే పార్టీ బలపడుతుందని సంస్థాగత ఎన్నికల అధికారి విద్యాసాగర్‌రెడ్డి అన్నారు.

సమస్యపై పోరాడితేనే పార్టీ బలపడుతుంది
బీజేపీ వర్క్‌షాపులో మాట్లాడుతున్న విద్యాసాగర్‌రెడ్డి

- బీజేపీ వర్క్‌షాపులో ఎన్నికల అధికారి విద్యాసాగర్‌రెడ్డి

గద్వాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యలపై నిత్యం పోరాడితేనే పార్టీ బలపడుతుందని సంస్థాగత ఎన్నికల అధికారి విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. శనివారం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన వర్క్‌షాపుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలో పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం ప్రతీ మూడేళ్లకో సారి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంటుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై కీలక సూచనలు అవసరం అన్నారు. ఈనెల 17,18,19 బూత్‌ కమిటీల పటిష్టత కోసం క్రియాశీల సభ్యత్వం అవసరమని వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా సభ్యత్వాల ఇన్‌చార్జి బొక్క బాల్‌రెడ్డి, నాయకులు బల్గెర శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, మీర్జాపురం రాంచంద్రారెడ్డి, దేదాసు, రాజశేఖర్‌ శర్మ, నాగేశ్వర్‌రెడ్డి, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:11 PM