సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:01 PM
ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కులగణనకు నిర్ణయం తీసు కోవడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వ హించారు.
మక్తల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కులగణనకు నిర్ణయం తీసు కోవడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు దేశంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతోమంది సరైన ప్రాతినిథ్యం లేక మరుగున పడ్డారన్నారు. అలాంటి వారిని చేరదీసేందుకే సీఎం కులగణనకు శ్రీకారం చుట్టారన్నారు. కులగణనతో వెనుకబడ్డ ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు. అన్ని మండలాలు, గ్రామాల ప్రజలు కులగణనకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ చంద్రకాంత్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్‌కుమార్‌గుప్తా, గోలపల్లి నారాయణ, కోళ్ల వెంకటేష్, లక్ష్మణ్, కావలితాయప్ప, బోయ రవికు మార్, హన్మంతు, ఆంజనేయులు, వెంకటేష్, కున్సి నాగేందర్, అబ్దుల్ రహెమాన్, నగేష్, నూరుద్దీన్, ఫయాజ్, రహీంపటేల్, శంశొద్దీన్, కల్లూరి గోవర్దన్, గుంతలి రవికుమార్, నర్సిములుగౌడ్, ఎల్లగౌడ్, ప్రవీణ్‌కుమార్, బోయ నర్సింహా, రాము, మధు, తిమ్మన్న పాల్గొన్నారు.