Share News

సోమశిల లింకు రోడ్డును వేంకటేశ్వరాలయ రోడ్డుకు కలుపుతా

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:05 PM

సోమశిల లింకు రోడ్డును రా మాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయం లింకురోడ్డుకు కలుపుతానని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

 సోమశిల లింకు రోడ్డును  వేంకటేశ్వరాలయ రోడ్డుకు కలుపుతా
రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- మంత్రి జూపల్లి కృష్ణారావు

పెంట్లవెల్లి, జనవరి 17 : సోమశిల లింకు రోడ్డును రా మాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయం లింకురోడ్డుకు కలుపుతానని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొ ల్లాపూర్‌ మండలం రామాపురం గ్రామంలో వేంకటేశ్వరా లయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఆలయానికి చుట్టూ ముట్టూ రేలింగ్‌ ఏర్పాటు తో పాటు ఆలయ సమీపంలో వంటశాల ఏర్పాటు చేస్తానని వారు పేర్కొన్నారు. అదేవిధంగా రామాపురం నుంచి టెంపుల్‌కు వెళ్లే దారిలో బ్రిడ్జి ఏర్పాటుతో పాటు సీసీ రోడ్డు వేయిస్తానని వారన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ఆట స్థలానికి చుట్టూ కాంపౌం డ్‌ వాల్‌ ఏర్పాటు చేస్తానని వారు పేర్కొన్నారు. సంక్రాం తి పండుగ సందర్భంగా వాలీబాల్‌ పోటీల్లో గెలుపొం దిన యువకులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అం దజేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆకునమోని రాము యాదవ్‌, కొమ్ము రాజుయాదవ్‌, మాజీ సర్పంచ్‌ బచ్చలకూర బాలరాజు, కాంగ్రెస్‌ నాయకులు నల్లవెల్లి రామస్వామి, చంద్రయ్య, ఎల్‌ఐసీ నాగరాజు, కలమూరి మధు, గడ్డం శేఖర్‌, సాకలి చెన్నయ్య, శేఖర్‌గౌడ్‌, గడ్డం అశోక్‌, ఉడత రామస్వామి, ఉ డత గోపాల్‌, కాకి రాముగౌడ్‌ తది తరులు పాల్గొన్నారు.

బండలాగుడు పోటీలు ప్రారంభం

కోడేరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రం లో బుధవారం ఎద్దుల బండలాగుడు పోటీలను రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి 80వేలు నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన అఖిలేష్‌రెడ్డి గెలుచుకోగా రెండవ బహుమతి 60వేలు కొత్తకోట గ్రామానికి చెందిన ఎ.గురునాథ్‌ ఎద్దులు గెలుచుకున్నాయి. మూడవ బహుమతి 50వేలు తిరుమలేష్‌, నాల్గవ బహుమతి 40వేలు వినిల్‌నాయుడు, ఐదవ బహుమతి 30వేలు వడ్డెమాన్‌ సుధాకర్‌రెడ్డి కంచుపాడు, ఆరవ బహుమతి 20వేలు ఎం.గోపాలకృష్ణ పెద్దదగడ, 7వ బహుమతి 15వేలు భాస్కర్‌గౌడ్‌ అయిజ గ్రామం, 8వ బహుమతి 10వేలు వష్టి పెద్దబాలయ్య ఎ ద్దులు గెలుచుకున్నాయి. మాజీ ఎంపీపీ కొత్త రామ్మో హన్‌రావు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ ఎన్‌.మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మండల పరిషత్‌ కో ఆప్షన్‌ మెంబరు ఎస్‌కే.బాబు, మాజీ ఎంపీటీసీ శ్రీను, ఎంపీటీసీ గడ్డం నరసింహ్మ, జగదీశ్వర్‌రావు, ఆదికుర్మ య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:05 PM