ఇందిరమ్మ ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:27 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లే కుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లే కుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్ర వారం వనపర్తిలోని బసవన్నగడ్డ, వనపర్తి శివా రు రాజనగరం వడ్డెగేరిలో జరుగుతున్న ఇందిర మ్మ ఇళ్ల సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒ క్కో సర్వేయర్ రోజుకు కనీసం 25 ఇళ్లు పూర్తి చే యాలని ఆన్‌లైన్‌లో డేటా నింపేటప్పుడు తప్పు లు చేయవద్దని సిబ్బందిని సూచించారు. సర్వే చే సేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలని చెప్పారు. ఈ సం దర్భంగా కలెక్టర్ రాజనగరం శివారులోని అమ్మ చెరువును పరిశీలించారు. చెరువు కట్టపై ఏర్పా టు చేసిన లైట్లు వినియోగంలో ఉన్నాయా అని మునిసిపల్ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు.
-వడ్డెగేరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయు లు సమయానికి హాజరవుతున్నారా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యా హ్న భోజనం అందించాలని ఎంఈవోకు సూచిం చారు. మునిసిపల్ కమిషనర్ పూర్ణచందర్, తహసీల్దార్ రమేష్ కలెక్టర్ వెంట ఉన్నారు.