పకడ్బందీగా సర్వే చేయాలి
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:02 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ నర్సింగరావు ఎన్యుమరేటర్స్‌కు సూచించారు.
అదనపు కలెక్టర్ నర్సింగరావ్
గట్టు/వడ్డేపల్లి/ఇటిక్యాల/అలంపూరు, నవంబరు 10 (ఆంద్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ నర్సింగరావు ఎన్యుమరేటర్స్‌కు సూచించారు. ఆదివారం మండలంలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా గ్రామాన్ని సందర్శించి ఎన్యుమరేటర్స్‌తో కలసి ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాల నమోదు పక్రియను స్వయంగా పరిశీలించారు. తప్పులు లేకుండా వివరాలను నిర్దేశించిన కోడ్ ప్రకారం నమోదు చేసుకోవాలని కోరారు. ఎంపీడీవో చెన్నయ్య, డీటీ శివశంకర్, పంచాయతీ కార్యదర్శి ఆజీజ్, హెచ్‌ఎం రామన్‌గౌడు పాల్గొన్నారు.
- వడ్డేపల్లి మండలం బుడమర్సు, తనగల గ్రామాల్లో చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. మండల, గ్రామాల పరిధిలో ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు వివరాలు చెప్పి సహకరించాలని ఎంపీడీవో ప్రజలకు సూచించారు.
- ఇటిక్యాల మండలం ఇటిక్యాల, బట్లదిన్నె, వేముల గ్రామాల్లో సర్వే సజావుగా కొనసాగిందని ంపీడీవో ఎండీ అజార్ మొయిద్దీన్ పేర్కొన్నారు. బుడ్డారెడ్డిపల్లిలో మాదాసి కురువ వారు ఎస్సీలుగా పరిగణించి నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను కోరినట్లు గ్రామస్థులు తెలిపారు.
- అలంపూరు మునిసిపల్ పరిధిలోని నాల్గవ వార్డులో కొనసాగిన సర్వేను మునిసిపల్ చైర్‌పర్సన్ మనోరమ ఆదివారం పర్యవేక్షించారు. మండలంలోని సింగవరం గ్రామంలో సర్వేను పరిశీలించారు. కౌన్సిలర్లు ఇంతియాజ్ అలీ, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.