పొరపాట్లకు తావు లేకుండా సర్వే పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 10:57 PM
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేయాలని ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్ అన్నారు.
- ఊట్కూర్ ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్
- గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే
ఊట్కూర్/మద్దూర్/మాగనూరు/ధన్వాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేయాలని ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్ అన్నారు. శనివారం ఊట్కూర్ మండల కేంద్రంలోని గుంతగేరి, బండగేరిలో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. గ్రామంలో ఇళ్లు లేని వారికి అన్యాయం జరగకుండా జాగ్రత్తగా యాప్‌లో వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి లబ్ధిదారుల ఫొటో తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రావు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా, మద్దూర్ పట్టణంలో పంచాయతీ కార్యదర్శి రామునాయక్‌తో పాటు, నియామక సిబ్బంది దరఖాస్తుల అధారంగా క్షేత్ర స్థాయికి వెళ్లి సర్వే పరిశీలన చేస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని పంచాయతీ కార్యదర్శి రామునాయక్ తెలిపారు. సైట్ సతాయిస్తుండంతో వివరాల నమోదులో కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. మద్దూర్‌లోని ఎస్సీ కాలనీలో చేపట్టిన సర్వేను మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు పరిశీలించారు.
మాగనూరు మండలం ఓబులాపురం గ్రా మంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఎంపీడీవో రహమతుద్దీన్ శనివారం పరిశీలించారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో సర్వే కొనసాగుతోందని, ఈనెల 31లోపు సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ధన్వాడ మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సర్వే మందకొడిగా నడుస్తుండడంతో దరఖాస్తుదా రులు ఆందోళన చెందుతున్నారు. సర్వేకు అఽధికారులు వస్తున్నారని తెలిసి చాలామంది తమ పనులు వదులుకొని ఇళ్ల వద్దే ఉంటున్నారు. సర్వేను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.