మట్టి తరలింపును అడ్డుకున్న ఆలయ కమిటీ
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:24 PM
మండలంలోని సంకలమద్ది శివారు సర్వే నెం బర్ 483 ప్రభుత్వ గుట్ట(రామ స్వామిగుట్ట)లో మొర్రం మట్టి తరలింపును ఆదివారం ఆల య కమిటీ సభ్యుల, గ్రామస్థు లు అడ్డుకున్నారు.
మూసాపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సంకలమద్ది శివారు సర్వే నెం బర్ 483 ప్రభుత్వ గుట్ట(రామ స్వామిగుట్ట)లో మొర్రం మట్టి తరలింపును ఆదివారం ఆల య కమిటీ సభ్యుల, గ్రామస్థు లు అడ్డుకున్నారు. జాతీయ రహదారి రోడ్డు నిర్మాణం కోసం గుత్తేదారులు రామస్వా మి గుట్ట నుంచి మోరం మ ట్టిని తరలించడానికి ప్రొక్లెయి న్, హిటాచీ వాహనాలతో మట్టిని తవ్వుతుండగా రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు అస్కని నరేందర్‌సాగర్, నాయకులు, అశోక్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, నగేష్, మల్లికార్జున్, వెంకటేశ్, రాజేందర్ అక్కడికి చేరుకుని తరలింపును అడ్డు కున్నారు. ఇది రామస్వామి ఆలయ గుట్ట ఎంతో ప్రకృతి రమణీయమైన సంపద ఉందని, ఇక్కడి నుంచి తరలిస్తే ఎంతో శ్రమపడి వేసిన సీసీరో డ్డు పూర్తిగా పాడైపోతుందని, ఈ విషయాన్ని కూడా ప్రాజెక్టు మేనేజర్‌కు సూచించామని గుత్తేదారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.