పరీక్షలు ఉన్నాయి.. టీచర్లను పంపించండి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:30 PM
పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి.. టీచర్లు లేకపోతే ఎలా రాస్తా మని కోయిలకొండ కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
- కేజీబీవీ విద్యార్థుల ఆందోళన
కోయిలకొండ, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి.. టీచర్లు లేకపోతే ఎలా రాస్తా మని కోయిలకొండ కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు నిరసన తెలిపేందుకు చౌరస్తాకు ర్యాలీగా వెళ్తుం డగా ఎంఈవో వెంకట్‌జీ అడ్డగించి వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా టీచ ర్లు జీతాల కోసం సమ్మెలో ఉన్నారని, పాఠశాల లో మేము ఒక్కరే ఉంటున్నామని తెలిపారు. 15 రోజులుగా పాఠాలు బోధించడం లేవని ఎంఈవో ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు ఉపాధ్యా యులను పంపిస్తామని ఎంఈవో సర్ధిచెప్పారు. పోలీసులు వచ్చి విద్యార్థులకు నచ్చ జెప్పారు. దాదాపు గంట సేపు విద్యార్థులు టీచర్లు రావాలని ఆందోళన చేశారు.