Share News

సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:29 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు.

సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట టౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు తాము శంకుస్థాపన చేస్తే వాళ్లు శిలాపలకాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలం కావ డంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంపై తొమ్మిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. నిజంగా ప్రజా ప్రభుత్వమే అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మైలారం మైనింగ్‌ను నిలిపివేయించామని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా తవ్వకాలు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని చేస్తోందని ఆరోపిం చారు. మైనింగ్‌ తవ్వకాలను గ్రామస్థులు వ్యతిరే కిస్తే కేసులు నమోదు చేశారన్నారు. అమ్రాబాద్‌ మండలంలోని లక్ష్మాపూర్‌ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుప్తనిధులు తవ్వుతూ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు అడ్డంగా దొరికితే నేటికి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సమావేశంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ నర్సింహ్మ గౌడ్‌, నాయకులు రమేశ్‌రావు, అమీనొద్దీన్‌, తిరుపతయ్య, నర్సయ్య పాల్గొన్నారు.రు.

Updated Date - Oct 22 , 2024 | 11:29 PM