Share News

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:13 PM

మిషన్‌ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఇంట్రా, గ్రిడ్‌ కార్యాలయాలను కలెక్టర్‌ విజయేందిర బోయి బుధవారం పరిశీలించారు.

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు

- మిషన్‌ భగీరథ ఇంట్రా, గ్రిడ్‌ కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మిషన్‌ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఇంట్రా, గ్రిడ్‌ కార్యాలయాలను కలెక్టర్‌ విజయేందిర బోయి బుధవారం పరిశీలించారు. సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఇంట్రా కార్యాలయంలో నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ల్యాబొరేటరీస్‌ ప్రమాణాల ప్రకారం రూ.తొమ్మిది లక్షల వ్యయంతో ఆధునీకరించిన జిల్లా ల్యాబొరే టరీని పరిశీలించారు. దీనిద్వారా మిషన్‌ భగీరథ సోర్స్‌ ద్వారా సరఫరా జరుగుతున్న ఇంట్రా, గ్రిడ్‌, గ్రామ పంచాయతీల ద్వారా సరఫరా జరు గుతున్న రక్షిత మంచినీరు శాంపిల్స్‌ సేకరించి, నీటి నాణ్యతను పరీక్షిస్తారని అధికారులు తెలిపా రు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, లీకేజీలు, మర మ్మతులు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఎస్‌.ఈ. జగన్మోహన్‌, కార్యనిర్వాహక ఇంజనీర్లు (ఇంట్రా, గ్రిడ్‌) పుల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:13 PM