Share News

అప్పులు చేసి చిప్ప చేతికిచ్చారు

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:04 AM

రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్‌కు ఇచ్చామని బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని, అప్పుల కుప్ప చేసి చిప్ప చేతికి ఇచ్చారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.

అప్పులు చేసి చిప్ప చేతికిచ్చారు
సభలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- ముడా చైర్మన్‌గా లక్ష్మణ్‌యాదవ్‌ ప్రమాణ స్వీకారం

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్‌కు ఇచ్చామని బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని, అప్పుల కుప్ప చేసి చిప్ప చేతికి ఇచ్చారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌గా లక్ష్మణ్‌ యాదవ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలను స్వీకరిం చారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. జి మధుసూ దన్‌రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌రెడ్డిలు ఆయనను చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం జేజేఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. పదేళ్ళ పాలనపై విసిగిపోయిన ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు బీఆర్‌ ఎస్‌ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. అడ్డగోలుగా సంపాదించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి జాతీయ పార్టీలకు కూడా లేనన్ని, బహుషా వెయ్యి కోట్ల నిధులు ఉన్నాయంటే ఏవిధంగా సంపాదించారో అర్థమవుతుందని ఆరోపించారు. మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచిన లక్ష్మణ్‌యాదవ్‌ పార్టీ అధికారంలో లేకున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కౌన్సిలర్లు అందరూ పార్టీ మారినా ఆయన మాత్రం పార్టీనే నమ్ముకొని కొనసాగారన్నారు. పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించే 145 గ్రామాల పరిధి ఉన్న ముడా చైర్మన్‌గా ఆయనకు అవకాశం కల్పించారని చెప్పారు. ఎన్నో ఒడిదుడు కులు ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి, నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూనే, ప్రతీ నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ ముడాకు పూర్తి స్థాయి అధికారాలు, నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నామినే టెడ్‌ పదవుల్లో సామాజిక సమతుల్యతను కచ్చి తంగా పాటిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వచ్చాక రూ. 265 కోట్ల అమృత్‌ నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లా డుతూ ఇది వరకు అక్రమ లేఅవుట్లకు అనుమ తిలిచ్చారని, ఎక్కడా 10 శాతం ఓపెన్‌ ల్యాండ్‌లు లేవన్నారు. బఫర్‌ జోన్‌లో, చెరువు ల్లోనూ లేఅవు ట్‌లు చేశారని విమర్శించారు. వాటిలో పేదలు ప్లాట్‌లను కొనుగోలు చేశారని, కానీ చర్యలు తీసుకుంటే వారు నష్టపోతారన్నారు. కానీ అక్రమ లేఅవుట్‌లు చేసిన వ్యాపారులు, అనుమతు లిచ్చిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌, బీజేపీ అనవసర రాజకీయం చేస్తున్నాయని విమ ర్శించారు. ఆర్థిక నేరస్తులైన కేటీఆర్‌, హరీశ్‌రా వులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పు డు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు స్థాని క సంస్థల ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి, వారి విజయం కోసం కృషి చేస్తామన్నారు.

రాజ్యసభ సభ్యుడు అనీల్‌యాదవ్‌ మాట్లాడుతూ అన్ని కులాలు, వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ సముచిత స్థానం ఇస్తోందన్నారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమే అందుకు నిదర్శన మన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 27న నిర్వ హించనున్న సదర్‌ ఉత్సవాలకు యాదవ సోదరు లు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, ఏపీ మిథున్‌ రెడ్డి, మల్లు నర్సింహా రెడ్డి, వినోద్‌కుమార్‌. సంజీవ్‌ ముదిరాజ్‌, సిరాజ్‌ ఖాద్రి, జహీర్‌ అక్తర్‌, చంద్రకుమార్‌గౌడ్‌, ఎం సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్‌, సీజే బెనహర్‌, సాయిబాబ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:04 AM