Share News

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతా

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:00 PM

: సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చా రు.

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతా
సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

- సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులకు హామీ

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చా రు. నారాయణపేట జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి బండి సంజయ్‌ పట్టణంలోని మునిసిపల్‌ పార్కు వద్ద కొనసాగుతున్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి, ఉద్యోగులతో మాట్లాడారు. సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చే స్తానన్నారు. ఎంపీ డీకే.అరుణ, రతంగ్‌పాండురెడ్డి, పి.శ్రీనివాసులు, రఘురామయ్యగౌడ్‌ తదితరులున్నారు.

సైనిక్‌, నవోదయ స్కూల్‌ మంజూరు కోరుతూ ఏబీవీపీ వినతి..

నారాయణపేట జిల్లాలో సైనిక్‌, నవోదయ స్కూల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు నారాయణపేట కలెక్టరేట్‌ వద్ద వినతిపత్రం అందించారు. విద్యార్థుల్లో జాతీయభావం పెంపొందించేందుకు సైనిక్‌, నవోదయ పాఠశాలలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు సతీష్‌, ఇంతియాజ్‌, చరణ్‌రెడ్డి, ఓంకార్‌ ఉన్నారు.

కృష్ణ - వికారాబాద్‌ రైల్వే పనులను చేపట్టాలి..

కృష్ణ - వికారాబాద్‌ రైల్వే పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ సీపీఎం నాయకులు పేట కలెక్టరేట్‌ వద్ద బండి సంజయ్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. నారాయణపేటను అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించి రైల్వేలైన్‌ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు వెంకట్రామిరెడ్డి, గోపాల్‌, మహేష్‌లు ఉన్నారు.

రైతులకు పసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయించాలి..

రైతులకు పసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయించాలని భారతీయ కిసాన్‌ సంఘం నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వ్యవసాయానికి సబ్సిడీని అందించేలా కృషి చే యాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘం నాయకులు వెంకోబా, అనంత్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:00 PM