Share News

పట్టణ స్వచ్ఛతకు పాటుపడాలి

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:54 PM

పట్టణ స్వచ్ఛతకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, ఇందుకు పారిశుధ్య కార్మికులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ సూచించారు.

పట్టణ స్వచ్ఛతకు పాటుపడాలి

- మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌

- తెల్లవారుజామున పారిశుధ్య పనులు పరిశీలన

గద్వాల టౌన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పట్టణ స్వచ్ఛతకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, ఇందుకు పారిశుధ్య కార్మికులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ సూచించారు. పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని, ఆ దిశగా పారిశుధ్య కార్మికులకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మునిసిపల్‌ కమిషనర్‌ దశరథ్‌తో కలిసి చైర్మన్‌ పరిశీలించారు. పట్టణంలోని పాతబస్టాండ్‌, వైఎస్సార్‌ సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌, కొత్త బస్టాండ్‌, కృష్ణవేణి సర్కిల్‌, బస్‌డిపో, రాజీవ్‌మార్గ్‌ తదితర ప్రాంతాల్లో పనులు పర్యవేక్షించిన చైర్మన్‌ హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలని జవాన్లను ఆదేశించారు. అనంతరం రోడ్లపై టీ స్టాళ్లు నిర్వహిస్తున్న యజమానులతో మాట్లాడారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ టీ కప్పులు, చెత్తాచెదారం వేయరాదని వారికి సూచించారు. కేటాయించిన మునిసిపల్‌ వాహనాల్లో మాత్రమే వాటిని వేసి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలన్నారు. ఇన్‌చార్జి శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ సునీల్‌, జవాన్లు పాండు, పరమేష్‌, గట్టన్న, భార్గవ్‌, నరసింహ, మారుతి, చిన్న, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 10:54 PM