నేటి బాలలే రేపటి బావిభారత పౌరులు
ABN , Publish Date - Nov 14 , 2024 | 10:59 PM
నేటి బాలలే రాబోయే కాలంలో దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే బావి భారత పౌరులు కావాలని జిల్లా విద్యాశాఖ అధి కారి అబ్దుల్ ఘని అన్నారు.
- డీఈవో అబ్దుల్ ఘని
- పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవం
- నెహ్రూకు పలువురి ఘన నివాళి
నారాయణపేట/నారాయణపేట రూరల్/కృష్ణ/కొత్తపల్లి/దామరగిద్ద/మరికల్/మాగనూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నేటి బాలలే రాబోయే కాలంలో దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే బావి భారత పౌరులు కావాలని జిల్లా విద్యాశాఖ అధి కారి అబ్దుల్ ఘని అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా మూడు రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీఈవో బహుమతులు అందించి, మాట్లాడారు. చిన్నారులు చదువుతో పాటు కళలు నేర్చుకోవాలన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. కా ర్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణురాలు గీతావిశ్వనాథ్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కార్తీక్‌గందే, హెచ్‌ఎం నారాయణ, బాలకేంద్రం సూపరింటెండెంట్ మ హిపాల్‌రెడ్డి, సంగనర్సిములు, వసంత్, లక్ష్మన్, రామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులున్నారు. నారాయణపేట మండలం బోయిన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు నెహ్రూ చిత్రపటానికి పూజలు చేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్‌లో లభించే వివిధ రకాల వస్తువులతో స్టాల్స్ ఏర్పాటు చేసి వాటి గురించి వివరించారు. అదేవిధంగా నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయురాలు పి.అనితను ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు సన్మానించారు. ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, శ్రీలత, గ్రామస్థులు పాల్గొన్నారు. కృష్ణ మండలం కున్షి, ముడుమాల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన బాలల దినో త్సవంలో హెచ్‌ఎంలు నల్లే శివరాజ్, దండు శేఖర్ లు మాట్లాడారు. కృష్ణలో చైర్మన్ వసంతమ్మ, ఉ పాధ్యాయులు పద్మాలతదేవి, అనిత, చంద్రకళ, అశోక్, ప్రియాంక, సుప్రజ తదితరులున్నారు. ముడుమాల్‌లో ఎంఈవో నిజాముద్దీన్, పీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు వై.జనార్ధన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం భూనీడు జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, పాటల పోటీలు నిర్వహించారు. దామరగిద్ద మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలతో పాటు, మద్దెల్‌బీడ్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దామరగిద్దలో ఎంఈవో కృ ష్ణారెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీ మహిపాల్, హెచ్‌ఎం అలివేలుమంగ, అంబ్రేష్, వాణి, గిరిజ, విజయలక్ష్మి, బాల బాలికలు పాల్గొన్నారు. మరికల్ మండలం తీలేరు ప్రాథమికోన్నత పాఠశాలలో లిటరసీ లైట్ ఫెస్టివల్‌లో భాగంగా వి ద్యార్థులు చేసినటువంటి కృత్యాలను ఎంఈవో మనోరంజని పరిశీలించారు. అనంతరం నిజాయితీ పెట్టెను ఆమె ప్రారంభించి, మాట్లాడారు. ఆ తర్వాత చిన్నారులతో కలిసి పాఠశాల ఆవరణలో పూలమొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఏఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం, పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మురళీధర్‌రెడ్డి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాజీ ప్రధాని నె హ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమావేశంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇందిరమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు, మాజీ సర్పంచు ఆనంద్‌గౌడ్, మాజీ సర్పంచు రాజు, వాకిటి శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా నెహ్రూ జయంతి
మక్తల్‌రూరల్ : పట్టణంలోని నెహ్రూగంజ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నా యకులు మాట్లాడుతూ నెహ్రూకు చిన్నపిల్లలంటే ఇష్టమని ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం విశేషమన్నారు. మాజీ ఎంపీపీ బి.చంద్రకాంత్‌గౌడ్, నారాయణ, బి.గణేష్‌కుమార్, లక్ష్మణ్, వెంకటేష్, శ్యామ్, హనుమంతు ఉన్నారు.