క్షేత్రస్థాయి అధ్యయనానికి శిక్షణ ఐఏఎస్‌లు
ABN , Publish Date - Nov 23 , 2024 | 10:45 PM
గ్రామంలోనే ఉంటూ గ్రామంలో క్షేత్ర స్థాయి అధ్యయనానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవన రుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లు శని వారం జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి వచ్చారు.
జడ్చర్ల/కోయిలకొండ/దేవరకద్ర, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గ్రామంలోనే ఉంటూ గ్రామంలో క్షేత్ర స్థాయి అధ్యయనానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవన రుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లు శని వారం జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి వచ్చారు. వీ రికి జడ్చర్ల ఎంపీడీవో విజయ్‌కుమార్‌తో పాటు గ్రామస్థు లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు శిక్షణ ఐఏఎస్‌లు పారుల్‌సింగ్, ఆదిత్యరాయ్, యశ్‌సుమీర్‌కుమార్‌కాలె, హరిప్రశాంత్, మాన్సిరాజీవ్‌గోఖ లేలు గ్రామంలోనే ఉంటూ క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తార ని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో బస చేసేందుకు గ్రామంలోని ఓ వసతిగృహా న్ని ఎంపిక చేశారు. స్వాగతం పలికిన వారిలో బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్, బాదేపల్లి సింగిల్ విండో వైస్‌చైర్మన్, తది తరులున్నారు.
దమాయపల్లిలో..
కోయిలకొండ మండలంలోని దమా యపల్లిలో ఆల్ ఇండియా సర్వీస్ బృం దం శనివారం పర్యటించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఏఆర్‌ఎస్‌కు ఎంపిక అయిన ఐదుగురు బృందం గ్రామంలో ఐదు రో జులు పాటు ఉండి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును అధ్యయనం చేయనున్న ట్లు తహసీల్దార్ రాజా గణేష్, ఎంపీడీవో కాళప్ప తెలిపారు. గ్రామంలో వారు ఉండేందుకు ఏర్పా ట్లు చేయనున్నట్లు తెలిపారు. పారిశు ధ్యం, పంచాయతీలో జరు గుతున్న పనులను పరిశీలించ నున్నట్లు వెల్లడించారు. ఎంపీవో నసీర్‌అహ్మద్, కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండలో శిక్షణ కలెక్టర్‌లు
దేవరకద్ర మండల పరిధిలోని గుడి బండ గ్రామంలో శనివారం నూతన శి క్షణ కలెక్టర్‌ల బృందం గ్రామంలో పర్య టించినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సంద ర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నూతన శిక్షణ కలెక్టర్‌లు నాలుగు రోజుల పాటు ఉండి గ్రామంలో సామాజిక స్థితిగ తులు, ప్రజలకు అందుతున్న సంక్షమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగహన చేసుకుంటున్నారన్నారు. అ నంతరం శిక్షణ కలెక్టర్లకు స్వాగతం ఫలికారు. తహసీల్దార్ కృష్ణయ్య, శిక్షణ కలెక్టర్లు అజేయ్‌కుమార్, వివేక్ ప్రవిన్‌కు మార్, యాగేందర్‌మోహ న్, దిక్షతమినా పాల్గొన్నారు.