Share News

మన్మోహన్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:01 PM

మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఆయన మరణం దిగ్భాంత్రికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మన్మోహన్‌కు ఘన నివాళి
మన్మోహన్‌సింగ్‌ చిత్ర పటం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ తదితరులు

మాజీ ప్రధాని వేసిన పునాదులతో దేశం పటిష్టం

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఆయన మరణం దిగ్భాంత్రికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్‌సింగ్‌ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించారన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలలో భారత్‌ ఐదో స్థానంలో ఉందంటే అందుకు మన్మోహన్‌సింగ్‌ వేసిన పటిష్ఠ పునాదులే కారణమన్నారు. పీవీ నర్సింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశం అప్పుల ఊబిలో ఆర్థిక ఇబ్బందులతో ఉండగా, ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని గాడిన పెట్టారన్నారు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక మరింత పటిష్ఠ స్థితికి దేశాన్ని తెచ్చారన్నారు. మరో వందేళ్లైనా భారత్‌కు ఆర్థికంగా నష్టం రాదన్నారు. ఆయన మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటన్నారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, అనిత, ఎన్‌పీ వెంకటేశ్‌, సీజే బెనహర్‌, సాయిబాబ, రాములుయాదవ్‌, అవేజ్‌, ఫయాజ్‌, అజ్మత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:01 PM