బీఆర్‌ఎస్ పాలనలో విద్యా వ్యవస్థకు తీరని నష్టం
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:33 PM
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో విద్యా వ్యవస్థకు తీరని నష్టం చేసిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు యూనివర్సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో విద్యా వ్యవస్థకు తీరని నష్టం చేసిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నూతన బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆయన వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభిం చారు. భవనం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. కొత్త కోర్సులను దృష్టిలో ఉంచుకొని మరిన్ని భవనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మరో రెండేళ్లలో యూనివర్సిటీలోని అన్ని భవనాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీర్వాదాలతో పీయూ ఈ స్థాయికి చేరుకున్నదని చెప్పారు. .కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యూజీసి నుం చి ప్రత్యేక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని పేద విద్యా ర్థులు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడ కుండా, ఇక్కడే అన్ని కోర్సులను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమ ంలో పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ప్రినిపాల్ డాక్టర్ చంద్రకిరణ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, ఎం.సురేందర్ రెడ్డి, ముఖ్య నాయకులు, యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.