కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:28 PM
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, దేవుడికి మధ్య పోలిక చూపిస్తూ పార్లమెంట్‌లో అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని అంబేడ్కర్ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరమ్మ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకుడు చంటి, ప్రజా కళా మండలి జిల్లా అధ్యక్షుడు రమేష్‌లు డిమాండ్ చేశారు.
- అంబేడ్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి దిష్టిబొమ్మ దహనం
నారాయణపేట/కృష్ణ/ధన్వాడ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, దేవుడికి మధ్య పోలిక చూపిస్తూ పార్లమెంట్‌లో అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని అంబేడ్కర్ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరమ్మ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకుడు చంటి, ప్రజా కళా మండలి జిల్లా అధ్యక్షుడు రమేష్‌లు డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేష రతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడిని నమ్మడం అనేది వారివారి ఇష్టానికి పరిమితమైన అంశం అన్నారు. దళిత బహుజనుల జీవితాలకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నుంచి విముక్తి కల్గిందని, దేవుడి వల్ల కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వెంకటప్ప, మాధవ్, పాండు, హనుమంతు, శేషు, బాల్‌రాజ్, ఎం.రాజు, ఎల్లప్ప, కృష్ణమూర్తి, కురుమప్ప తదితరులున్నారు.
అదేవిధంగా, మాగనూరు మండల కేంద్రం లోని అంబేడ్కర్ విగ్రహం ముందు అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం మం డల అధ్యక్షుడు సగరం రమేష్ మాట్లాడుతూ అంబేడ్కర్, దేవుడికి మధ్య పోలిక చూపిస్తూ అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయడంతో పాటు, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మహేష్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బైరంపల్లి నారాయణ, బ్యాగరి నర్సింలు, భాస్కర్, రాఘవేంద్ర, పవన్, శంకర్ తదితరులున్నారు.
ధన్వాడలో బీఎస్పీ నాయకులు గురువారం రాస్తారోకో చేపట్టారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్ ను అవమానపర్చిన హోంమంత్రి అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగేలి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాస్తారోకోలో హోంమంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గుర్రం రాజు, జడల బాల్‌రాజు, అర వింద్, చర్లపల్లి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.