Share News

ఫిట్‌నెస్‌ యంత్రాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:06 PM

ఖోలే ఇండియా నిధుల ద్వారా మంజూరై న ఫిట్‌నెస్‌ యంత్రాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్‌ వో డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌ అన్నారు.

ఫిట్‌నెస్‌ యంత్రాలను వినియోగించుకోవాలి

డీవైఎస్‌వో డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌

గద్వాల అర్బన్‌, సెప్టెంబరు 18: ఖోలే ఇండియా నిధుల ద్వారా మంజూరై న ఫిట్‌నెస్‌ యంత్రాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్‌ వో డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సోమనా ద్రి ఫుట్‌బాల్‌ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌ యంత్రాల ప్రారం భోత్సవానికి డీవైఎస్‌ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి క్రీడకు ఫి ట్‌నెస్‌ ఎంతో ముఖ్యమని, ప్రతి క్రీడాకారుడు ఫిట్‌నెస్‌ కలిగి వుండి రాణిస్తే నే విజయాలు తమ సొంతమవుతాయన్నారు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌ క్రీడలో 90నిమిషాల పాటు నిర్విరామంగా గ్రౌండ్‌లో పెరిగెత్తేందుకు ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి జితేందర్‌, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ఫిజికల్‌ డైరెక్టర్‌, సీనియ ర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు బషీర్‌, ఫుట్‌బాల్‌ కోచ్‌ విజయ్‌కుమార్‌, ప్రవీణ్‌ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇండికా శివ, ప్రశాంత్‌గౌడ్‌, క్రీడాకారులు నవీన్‌, నరసింహరాజు, విజయసింహ, జూనియర్‌ క్రీడాకారులు ఉన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 11:06 PM