వాజపేయి జీవితం ఆదర్శం
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:22 PM
మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహారి వాజపేయి జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎంపీ డీకే అరుణ అన్నారు.
- ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ కలెక్టరేట్/పాలమూరు, జడ్చర్ల మిడ్జిల్, భూత్పూర్, హన్వాడ బాలానగర్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి)ః
మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహారి వాజపేయి జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో వాజపేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, మాట్లాడారు. వాజపేయి ఆలోచనా విధానాలను బీజేపీ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. అనంతరం పీయూ ఎదుట ఉన్న సాందీపని ఆవాసంలో మొక్కలు నాటారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి.పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి, కార్యరద్శి కె.కిరణ్‌కుమార్‌రెడ్డి, కె.రాము, కె.రాములు, పాండురంగారెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, అచ్చుగట్ల అంజయ్య, మెట్టుకాడి శ్రీనివాసులు, యాదయ్య, కె.సతీష్‌కుమార్, జయశ్రీ, గోవిందనాయక్, జాజం సుబ్రహ్మణ్యం, నారాయణయాదవ్, ప్రవీణ్‌యాదవ్, నవీన్‌కుమార్‌రెడ్డి, దర్పల్లి హరికృష్ణ పాల్గొన్నారు.
జడ్చర్ల మునిసిపాలిటీ హౌజింగ్ బోర్డులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు బీజేపీ నాయకులు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అంతకుముందు వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీజేపీ నాయకులు సామల నాగరాజు, రమేశ్‌జీ, సామల నర్సిములు, శ్రీనివాస్‌గౌడ్, ఎంబీ బాలకృష్ణ, బాలవర్ధన్‌గౌడ్, మధు, రాజశేఖర్‌రెడ్డి, కొంగళి శ్రీకాంత్, వెంకట్, బుక్క నవీన్, శ్రీనాథ్, పిట్టల నరేశ్, అంజలి పాల్గొన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతిరూపం అటల్ బీహరి వాజపేయి అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్సీ బాలికల వసతి గృహంతో పాటు వృద్ధులకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, గిరిజనమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్‌నాయక్‌లతో కలిసి పండ్లు పంపిణీ చేశారు.
వాజపేయి ఆశయ సాధనకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం భూత్పూర్‌లో వాజపేయి చిత్ర పటానికి పూలమా వేసి నివాళి అర్పించారు. పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అమిస్తాపూర్‌కు చెందిన ఆటో రాంచంద్రయ్య కూతురు శైలజ సీఏ చదువకు బండారి శాంతికుమార్, సుదర్శన్‌రెడ్డి కలిసి రూ.50 వేలు ఆర్థికసాయం అందజేశారు.
హన్వాడ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు వాజపేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
చిన్నచింతకుంట మండల కేంద్రంలో వాజపేయి చిత్ర పటానికి బీజేపీ నాయకులు నివాళి అర్పించారు. బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నంబిరాజు, అసెంబ్లీ కన్వీనర్ కుర్మ రమేష్, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రాము, మహేష్, చంద్రుడు, రుతుకుమార్, దయాసాగర్, బాలచందర్ పాల్గొన్నారు.