అర్హులందరికీ పథకాలు అందిస్తాం
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:25 PM
We will provide schemes to all eligible
- ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
నారాయణపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ముఖ్యమైన విద్యా, వైద్య అ త్యవసర సేవలు అందించ డంలో రాజకీయాలు చేయమ ని, అర్హులైన నిరుపేదలందరి కీ సంక్షేమ పథకాలు తప్పని సరిగా అందిస్తామని ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యా ంపు కార్యాలయలో అదనపు కలెక్టర్ బెనాష లోంతో కలిసి 138 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, సలీం, కౌన్సిలర్లు మహేష్, అమిరోద్దిన్, విండో చైర్మన్ నర్సింహ రెడ్డి, ఈదప్ప, వెంకట్రామరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సర్వేలో వివరాలు వెల్లడించిన ఎమ్యెల్యే
సర్వేలో భాగంగా జిల్లా కేంద్రంలోని నివా సంలో ఎమ్యెల్యే పర్ణికారెడ్డి మునిసిపల్ కమిషనర్ సునీత, ఎన్యుమరేటర్లకు తమ వివరాలు వెల్లడించారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
నారాయణపేట టౌన్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీ న్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎక్లాస్‌పూర్ గ్రా మ శబరి మహిళా సంఘం సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. మొత్తం రూ.8.50లక్షలతో క్యాం టీన్ ఏర్పాటు చేసిన్నట్లు నిర్వాహకులు ఎమ్మె ల్యేకు తెలిపారు. కోశాధికారి చంద్రకళ, లక్ష్మి, ఏపీఎం, సీసీలు, నాయకులు పాల్గొన్నారు.